ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35

దులనుండి చూచుచుండనిమ్ము. వారుగూడను నిన్నుజూచి మిక్కిలి భయమును జెందుదురు. కాని వారినట్టి సమయమున మాట్లాడవద్దని యదివరకే చెప్పియుండవలెను. ఇట్లు నీమనోశక్తి నీవిధముగ నుపయోగించి నీదేహము నేవిధముగ జూపింపవలెనని యనుకొనిన నావిధమైన రంగుగా జూపించగలుదువు. ఇంతటిశక్తి నీకు గలిగినయెడల నీస్నేహితుల కెట్టి మాదిరి గనుపించ నెంచిన నట్టిమాదిరి గనుపించగలవు. గాన నితరులను యందు భ్రమింపజేయగలుదువు. అందుచే ప్రతివారును నీయందిష్టముగా నుందురు. లోకహితుడవని పేరును సంపాదింపగలుగుదువు. తత్కారణమున నీవేమాటన్నను ప్రతివారదియొక గొప్పవిలువగానెంచి నమ్ముచుందురు. నీముక్కురంధ్రములగుండ గాలినిపీల్చి యూపిరితిత్తులం దెంతసేపు నిలుపగలవో యంతసేపుమాత్రముంచి పిమ్మట నెమ్మదిగా ముక్కురంధ్రముగుండనే వదలివేయుచుండుము. గాలిని వదలివేయునప్పుడు నీమనసునం దిట్లనుకొనుము. "నేనిప్పుడు వదులునటువంటిగాలి నాదేహమునందుండు చెడ్డశక్తినంతయును తీసుకొని పోపుచున్నది. మంచిశక్తినిమాత్ర ముంచుచున్నది. నాశరీరమునందుగల యవయవములన్నిటిని నాకు స్వాధీనము జేసిపోవుచున్నది". ఈవిధంబుగ ప్రతిదినమీ యభ్యాసము చేయునపుడెల్ల నిశ్చలచిత్తము తలుచుచున్న యెడల నీదేహమంతయు మంచిశక్తితో నిండి ప్రతి యవయవమును నీకు లొంగి చెప్పిన విధమున పని జేయుచుండును. ఇంట గెలిచి రచ్చగెలువుడనిజెప్పిన సామతప్రకారము మొదట నీ