ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(5)

33

పు గడ్డవలె నామనోశక్తివల్ల జేయబోవుచున్నానని యెల్లరకును జెప్పి నీవు విభూతిగడ్డవంక జూచుచు దృఢమనస్సుతో “నాచేతియందున్నది పటికిబెల్లపుగడ్డగాని విభూతిగడ్డకాదు” అని నీమనోశక్తి నుపయోగింపుము. అంత నెల్లరకును వింతయగునట్టు నీచేతీయందున్నది పటికిబెల్లపుగడ్డయై యుండును. పిమ్మట దానిని పగులగొట్టి సభికులకందరకును బెట్టినయెడ తియ్యగా పటికిబెల్లమువలె నున్నదని చెప్పుదురు. ఏమి, మన మేదియనుకొన్న యదియగుచున్నదే, ఇంతకన్న గొప్పవిషయమెద్ది ! కాన చదువరులారా, ఈ మనోశక్తికై తప్పక మీరెల్లరును బహు శ్రద్ధతో పాటుపడవలయునని నేను మిక్కిలి ప్రోత్సాహము చేయుటకు సాహసించుచున్నాను.

DEVELOPMENT OF BODY.

శరీరమును బెంచుట.

నీవు ప్రతిదినమును సూర్యోదయమునకు పూర్వములేచి నిత్యకృత్యములను దీర్చుకొని పిమ్మట స్నానమాచరించి మీగృహమునందు పరిశుభ్రమగు గదిని జూచి దానియందు సాంబ్రాణి మొదలగు సువాసనవచ్చు పొడిని నిప్పుమీదజల్లి గదినంతయును పొగయానదించునట్లు జేయుము. పిమ్మట నత్తరు పన్నీరు మొదలగునవి సువాసనవచ్చునట్లు కొంచెము కొంచెముగా గదిలో చిలకరించుము. దొరకినచో సువాసనగల పుష్పములనుగూడ గదియందు వెదజల్లుము. తదనంతర మే కాకివై గదిలోనికి ప్రవేశించి తలుపులుమాత్రముమూసి కిటికీలను తెఱచియుంచి కిటికీలగుండ నెవ్వరిని తొంగిచూడకుం