ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(4)

25

టిని నావద్దకు రప్పించియుంటిని. వేయేల, మనోశక్తిని సంపాదించిన వానికి ప్రతివారును స్నేహితులగుదురనుట వేరుగ జెప్పవలెనా? మరియు రెండు సంవత్సరములక్రిందట ననగా నే నీమనోశక్తిని సంపాదించుటకు మొదలిడినప్పుడు తాడేపల్లిగూడెమునకు రాత్రి రెండుగంటలప్పుడు కటికిచీకటిలో పడవదిగి రైల్వేస్టేషనువద్దకు రావలసివచ్చెను. అప్పుడాకాశమంతయును మేఘములచే నావరింపబడి సన్నగా వర్షముగురియుట కారంభించెను. అట్టిసమయమున పడవనుదిగినపిమ్మట నా కెవ్వరును తోడులేకుండుటగూడ తటస్థించెను. నేను పదునైదు వత్సరముల బాలుడనగుటచే నట్టిసమయమున రైల్వేస్టేషనునకు యొంటరిగా వచ్చుటకు భయముజెంది పోవుటకెంత మాత్రమును సాహసింపనెతి. కాని యప్పుడు తాడేపల్లిగూడెము రైల్వేస్టేషనుసకు తెనాలిబోవునట్టి రైలుబండి యొకటి రాత్రి మూడుగంటలకాలమున వచ్చుచుండుటచే యొంటరిగానైనను బోవనుద్యుక్తుడ నైతిని. అక్క టా, మరియొకబాలుడైనచో నట్టిసమయమున జరిగినవిపత్తునకు గుండెబ్రద్దలై ప్రాణంబులను గోల్పోవకయుండుట తటస్థించునా ! అహో, ఆజరిగినవిషయమును మరల జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు గుండెలు ఝల్లుమనుచున్నవి. మాటలు తడబడుచున్నవి. కళాహీనము గలుగుచున్నది. చేతులు కాళ్ళు గజగజ వణకుచున్నవి. అదిద్దియో వింటిరా? బయలుదేరినపిమ్మట నైదారంగలు వేసినతోడనే యాకాశమంతయు నల్లనిమేఘములచే గప్పబడి నందున నేను నడచుచున్న ది రోడ్డుగనే యున్నప్పటికిని రోడ్డు