ఈ పుట ఆమోదించబడ్డది

నమూనాను పదాల గణన ఆధారంగా ఉండేట్టు నిర్ణయించాం. దైనందిన జీవితంలో మనం అనుభవించే ఆనందాం, విషాదం, ప్రేమ, విరహం వంటి భావాలు, అనుభూతులే కాకుండ సామాజిక ,రాజకీయ అంశాలలో వేటినైనా రెండు వాక్యాలలోనే స్పురించిన వెంటనే చెప్పగలిగే అవకాశం మాలికలుగా మార్చుకునే సౌలభ్యం ఈ నమూనాలో వుండటం వలన, అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది మన్ననలు చూరగొని ఇప్పటివరకూ సుమారు పదిహేను వేల మాలికలు రాయబడి మూడువేల మంది సభ్యులతో ఈ గ్రూపు ప్రస్థానం కొనసాగిస్తోంది. గ్రూపు మొదలుపెట్టినప్పుడు చేరిన చాలామంది సభ్యులు ఇప్పటికీ కొనసాగుతుండగా మధ్యలో ఎంతోమంది కొత్తవారిని కలుపుకుంటూ కవిత్వం రాయాలన్న తపనకు బీజాలు వేస్తూ కవులుగా మారుస్తూ ముందుకు సాగుతోంది మణిమాలిక. ఈ ప్రక్రియలో భాగంగా సభ్యులు రాసిన మాలికల నుండి ప్రతివారం అత్యుత్తమమైన మాలికల్ని సభ్యులచేతనే ఎంపిక చేయిస్తూ ప్రతివారం మధ్యలో నేటి పదం, వాక్యపూరణం నుండి శీర్షికలతో సభ్యులలో ఆసక్తిని పెంచే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం.

ఇంతమంది కవులు ఇన్నివేల మాలికలు వ్రాసిన తరువాత వారి భావాల్ని,అనుభూతుల్నిఅంతర్జాలానికి ఫేస్‌బుక్కుకూ మాత్రమే పరిమితం చెయ్యకుండ, పుస్తకరూపంలోకి తీసుకువచ్చి కవిత్వం ప్రియులకు కూడ అందించాలనే సంకల్పంతో, ఎంత ఎక్కువ మంది సభ్యుల మాలికలు వీలైతే అంతమందివి తీసుకుని పుస్తకంగా అచ్చు వేయించడానికి నడుం బిగించాం. రాసిన అన్ని మాలికల్నిఅచ్చుకు తీసుకోలేము కాబట్టి, వారు గ్రూపులో రాసిన మాలికల సంఖ్య ఆధారంగా కొందరికి అవకాశం కల్పిసూ,నాణ్యతలిగిన వాటిని ఎంపిక చేసి ప్రచురణకు స్వీకరించాం. నాణ్యత కలిగిన మాలికల ఎంపికకు గ్రూపు కో-అడ్మిన్‌లు మా ఇద్దరితో పాటు సభ్యులు దయానంద్‌ దేవరాజుల, లక్ష్మీ యలమంచిగార్లతో ఒక కమిటె ఏర్పరచి 20 మంది సభ్యుల యొక్క మాలికల నుండి అత్యుత్తమ కవితా మాలికలకు పుస్తకంలో చోటు కల్పించాం. ఈ పుస్తకంలో చోటు సంపాదించిన సభ్యులలో ఒకరిద్దరు తప్ప మిగతా సభ్యులందరూ మొదటిసారి తమ కవిత్వాన్ని పుసక్త రూపంలో చూసుకోబోతున్నందుకు సంతోషపడు తున్నవారే అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా మా కమిటీ సభ్యులకు వారు చేసిన సేవలకు మా మనóపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కోరిన వెంటనే...

5