ఈ పుట ఆమోదించబడ్డది

180

46.

నీకంటే నీఊహలే నయం
నానుండి ఎన్నటికి విడిపోవు

47.

తారలు చీకటింటికి తొరణాలు కడుతున్నవి
ఆకాశానికి పండుగొచ్చిందని నిండుపున్నమి రాకతో

48.

నిజంగా వికటకవివే నువ్వు
ఇరకాటంలో కూడ వెటకారం జోడించి సమస్యను సాధిస్తావు

49.

పిడుగుల దాటికి మబ్బులకు గాయాలయ్యాయి
చూడుశ్వేతరుధిరాన్ని ఎలా కారుస్తున్నాయో

50.

వడ్రంగిపిట్టలా మనసును తొలుస్తున్నా
నీజ్ఞాపకాలలో గూడు కట్టుకోవాలని

51.

దిగాలు పడ్డది ఒంటరితనం
నిరంతరం నువ్వు నా జ్ఞాపకాలతో సహజీవనం చేస్తుంటే

52.

మనసు నావ విరహపు కొండను ఢుకొంది
ప్రణయ జీవుల్నివిషాద సంద్రంలో ముంచేస్తూ!

53.

దొంగ పోలీస్‌ ఆాడుతున్నాం...
కళ్ళకు కనపడకుండా నువ్వు, కలల్లో వెదుకుతూ నేను

54.

కర్ణుడు పారబోసిన నెయ్యి రథాన్నికుంగదీస్తే
నేను పారేసుకున్న మనసు బ్రతుకును కుంగదీసింది

55.

తానెళ్ళిన దారిలో అంవేషణ
జ్ఞాపకాల గుర్తుల కోసం

మణి మాలికలు జ విశ్వనాథ్‌ గౌడ్‌ ఈడిగ