ఈ పుట ఆమోదించబడ్డది

16.

 గర్భం నుండే మొదలు ఆడపిల్లకు
చావు, బ్రతుకుల సుదీర్ఘ… పోరాటం

17.

ప్రతిరోజు వసంతమే వాలుజడకి
రోజుకోరకం పువ్వు విరబూస్తుంది

18.

నామనసుకు ప్రేమతో కూడికలే వచ్చు
ద్వేషంతో తీసివేతలు ఇంకా నేర్చుకోలేదు

19.

చోద్యం చూస్తావే...
కుదుటగా ఉన్న మనసుని కుదిపేసి

20.

చీకది విజయగర్వం
తారకలను, వెన్నెలను వెలుగులోకి తెచ్చానని

21.

మౌనరాగం ఆలపిస్తున్నా
నీ మది వీణలో సరిగమలు పలికించడం తెలియక

22.

మౌనం రాజ్యమేలుతోంది
అలసిన ప్రపంచాన్నిచీకటి నిద్రాపుచ్చాక

23.

సంద్రాపు అలదీ నీది ఒకేరీతి
చెంత చేరినట్లే చేరి వెనక్కెళ్ళిపోతారు

24.

కన్నీళ్ళు కారిపోతున్నాయి
కంటికుండకి చిల్లు ఎవరు పెట్టారో

25.

నింగి...నేలతో కరచాలనం
వానచినుకుల చేయి అందిస్తూ

మణి మాలికలు జ విశ్వనాథ్‌ గౌడ్‌ ఈడిగ

177