ఈ పుట ఆమోదించబడ్డది

150

66.

 'ముత్యం' రాధమ్మ...'నీలం' క్రిష్ణయ్య
'రాధామాధవం' మాత్రం కంటికింపైన 'కెంపే'

67.

ప్రేమగా చూడకు
పెదవి మాట సైతం మరచిపోతోంది

68.

అపుడు సాగింది మనమధ్య ప్రణయప్రవాహం
ఇపుడు కదలన్మంటోంది ఘనీభవించిన జ్ఞాపకాలనదం

69.

నీకై వేచి చూసిన క్షణాలు
కాలం గడియారంలో కదలని యుగాలు

70.

మన జీవనగ్రంధం చాలా క్లిష్టమైనదే
గ్రాంథికం కంటే కష్టమైననిన్నర్ధం చేసు కోలేక

71.

నిశీధికి ధవళవర్ణం పూస్తుంది నీ మాటలవెన్నెల
కౌముదికే కవనం నేర్పిస్తుంది నీ సౌందర్యాలవెల్లువ

72.

సూదంటురాయల్లే మనసును లాగేస్తావు
చూపులకత్తులతో మెత్తగా కోసేస్తూ

73.

వేరు చేసే పనిలో 'వన'మాలి
పూలతోటలో నీవు నవ్వులు రువ్విపోయాక

74.

కళ్ళల్లో వెన్నెలపాతాలు నీ జతలో
నిప్పుల ఉప్పెనలు నీ వియోగంలో

75.

కళ్ళకెప్పుడూ కనబడేవి కల్లలే
రెప్పలమాటున దాగున్నవి సత్యాలే

మణి మాలికలు జ శ్రీనివాస్‌ ఆర్‌.వీ.ఎస్‌.ఎస్‌