ఈ పుట ఆమోదించబడ్డది
76.
- ప్రేమలో విఫలమైతే తాగాలా...?
- కన్నీళ్ళున్నాయిగా...మందు ఎందుకు..?
77.
- నవ్వినా ఏడ్చినట్టుంది.
- నీ నవ్వుల ఎక్స్పైరీడ్ దాటిపోయిందా
78.
- నీ పయనంలో నేనో మజిలీ
- నాకు మాత్రం నీవే గమ్యం
79.
- నివేదించనా నీకు నా ప్రతీ అక్షరాన్ని
- ఏఒక్కటైనా నీకు నా వేదాన తెలుపగలదాని
80.
- అనుమానాలెందుకు అమ్మాయి
- నా ప్రతీ స్పందన నీ స్పందానల ప్రతిస్పందనలే
81.
- తాను వెళ్ళిపోయింది నిశ్శబ్దంగా
- పున్నమిరేయికి నల్లరంగు అద్దుతూ
82.
- కాలం ఎలాిం గాయాన్నైనా మాన్పుతుందాట
- కానీ..నువ్వు కాలానికే గాయంచేశావు
83.
- అడగంగనే వరాలిస్తావట...నిజమా శంకరా...?
- అంతేలే...బంగారమడిగినా ఇచ్చెడిది బూడిదేగా
84.
- నా చేతిలో సిగరెట్
- నీ తలపులతో నేను...ఒకేలా...కడదాకా కాలిపోతూ
85.
- ఎవరు అన్నారు కన్నీరుకి రంగులేదని
- నీతలపులతో అది సప్తవర్ణాలను సంతరించుకుంది
మణి మాలికలు జ సాయి కామేష్ గంటి
121