ఈ పుట ఆమోదించబడ్డది

పని

321

అసమర్థులకీ, స్వార్థపరులకీ. ఇది తప్పనిసరి అనిపిస్తుంది. మీ ప్రసంగాలతో మీరు గాయపరచారా? ఒక ధనవంతుణ్ణి నేనెరుగుదును. మీరు ధనవంతుల గురించి అన్నదానికి ఆయన చాలా బాధపడ్డాడు."

నేను ఎవరినీ గాయపరచాలని అనుకోను. ఒక పనిచేస్తున్నప్పుడు ఎవరైనా గాయపడితే, నా ప్రకారం ఆ పని మానెయ్యాలి. నాకే పనీ లేదు. పరివర్తన తీసుకొచ్చేందుకుగాని, విప్లవం తీసుకొచ్చేందుకుగాని ఏవిధమైన పథకాలూ లేవు. నాకు పని కాదు మొదట, ఇతరులకు హాని కలిగించకూడదన్నదే. అన్నదానివల్ల ఆ ధనవంతుడు గాయపడి ఉంటే, ఆయన నా వల్ల గాయపడలేదు. ఉన్నస్థితిలోని సత్యం మూలాన్ని. అది ఆయనకు నచ్చదు. ఆయన బయట పడిపోవటం ఆయన కిష్టంలేదు. ఒకరిని బయట పెట్టటం నా ఉద్దేశం కాదు. ఉన్నదానిలోని సత్యం మూలాన్ని ఎవరైనా తాత్కాలికంగా బయటపడిపోయి, తాను చూచిన దానికి కోపం తెచ్చుకుని, దానికి ఇతరులను నిందిస్తారు. కాని అది యథార్థం నుంచి పారిపోవటం మాత్రమే. యథార్థం చూసి కోపగించుకోవటం తెలివితక్కువతనం. కోపంతో యథార్ధాన్ని తప్పించుకోవటం సాధారణంగా ఆలోచించకుండా చూపే ప్రతిక్రియ.

కాని, మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఏది ముఖ్యం - పని చెయ్యటమా, ఇతరులకు హాని కలిగించకుండా ఉండటమా?

"పని జరిగి తీరాలి. మీరలా అనుకోరా?" అని మంత్రిగారు మధ్యలో అన్నారు.

ఎందుకు జరిగితీరాలి? కొంతమందికి లాభం కలిగించటంలో మరికొందరిని నాశనం చేస్తే దానికి విలువ ఏముంది? మీ దేశాన్ని మీరు రక్షించుకోవచ్చు, కాని ఇంకొకదాన్ని మీస్వలాభానికి ఉపయోగించుకోవచ్చు. మీ దేశం గురించీ, మీపార్టీ గురించీ, మీ సిద్ధాంతం గురించీ మీకెందుకంత విచారం? మీ పనితో మీరు ఎందుకు ఐక్యం అవుతారు? పనికి ఎందుకంత ప్రాముఖ్యం?

"మనం పని చెయ్యాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. లేదా, చనిపోవటమే నయం. ఇల్లు కాలిపోతుంటే మౌలిక విషయాల గురించి