ఈ పుట ఆమోదించబడ్డది

310

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఆందోళనపడుతూ, బాధ్యతల భారంతో ఉన్నాడు. తన సమస్యల గురించి మనిషిని నిస్సత్తువగా చేసే వాటిని గురించి చెప్పటం మొదలుపెట్టాడు. బాగా చదువుకున్నవాడినేనన్నాడు - అంటే, చదవటం ఎలాగో తెలుసుకుని ఉండటం, పుస్తకాల్లోంచి వివరాలు సేకరించటం. ఎన్నో సంవత్సరాల నుంచీ పొగ తాగటం మానెయ్యటానికి ప్రయత్నిస్తున్నాడుట. కాని, ఎంతకీ పూర్తిగా మానెయ్యలేకపోయాడుట. చాలా ఖరీదు, పైగా తెలివితక్కువది, అందుకని మానెయ్యాలని కోరుతున్నాడుట. మానెయ్యటానికి చెయ్యగలిగిన ప్రతిదీ చేశాడుట, కానీ మళ్లీ మొదలు పెట్టేవాడుట. ఇది ఆయనకున్న సమస్యల్లో ఒకటి. ఆయన తీవ్రంగా, అస్తిమితంగా, బక్కపలచగా ఉన్నాడు.

దేన్నైనా నిందిస్తే దాన్ని అర్థం చేసుకోగలమా? దాన్ని అవతలికి తోసెయ్యటం, దాన్ని, అంగీకరించకపోవటం సులభమే. కాని ఆనందించటమైనా, అంగీకరించటమైనా సమస్యని తప్పించుకోవటమే అవుతుంది. పసిపాపని నిందించి అవతలికి తోసెయ్యటం మీకు ఇబ్బంది కలిగించకుండా ఉండటానికే. కాని పసిపాప అలాగే ఉంటుంది. నిందించటం అంటే లెక్క చెయ్యకపోవటం, శ్రద్ధ చూపించకపోవటం. నిందించటం వల్ల అవగాహన అవటం కుదరదు.

"పొగ తాగుతున్నందుకు నన్ను నేను ఎన్నోసార్లు నిందించుకున్నాను. నిందించకుండా ఉండటం కష్టం."

అవును నిందించకుండా ఉండటం కష్టమే. మనల్ని ప్రభావితం చేసినది - కాదనటం, సమర్థించటం, పోల్చటం, వదులుకోవటం - వీటిమీద ఆధారపడింది. దీని ప్రభావంతోనే మనం ఏ సమస్యనైనా సమీపిస్తాం. ఈ ప్రభావమే సమస్యనీ, సంఘర్షణనీ పెంపొందిస్తుంది. పొగ తాగటం గురించి సహేతుకంగా ఒక నిర్ణయానికి రావటానికి ప్రయత్నించారు మీరు. దాన్ని తెలివితక్కువది అన్నప్పుడు, దాన్ని గురించి అంతా యోచించి, అది తెలివితక్కువపని అనే నిర్ణయానికి వచ్చారు. కాని, ఆ సహేతుక నిర్ణయం మీరు మానేసేటట్లు చెయ్యలేదు. సమస్యకి కారణం తెలుసుకోగానే దాన్నుంచి విముక్తి పొందాలనుకుంటాం. కాని తెలుసుకోవటం వివరాలను మాత్రమే -మాటల్లోనే నిర్ణయానికి రావటం. ఈ జ్ఞానం సమస్య అవగాహన అవటానికి