ఈ పుట ఆమోదించబడ్డది
కాగితంపై వ్రాసి, మడతలు వేసి, మొదటి కాగితం వేసిన దానిలోనే వేయండి. ఇప్పుడు మీరు మరో కాగితం తీసుకొని - ఒక పేరు వ్రాసి, మడత పెట్టి, మీ వద్ద వుంచుకొని - మీ స్నేహితులతో ఒకరిని వ్రాసిన పది కాగితాలలో ఒక దానిని తీసి అందులో ఏమి పేరు వుందో చూడమనండి; చూసినతరువాత - దివ్యదృష్టితో ఆ పేరు నాకు తెలిసిందని, దానిని నా వద్ద కాగితంలో వ్రాసానని చెప్పి - మీ చేతిలో కాగితం మీ మిత్రులకు ఇవ్వండి ! ఆ పేరును చదివి వారు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ రెండుచీటీలలోపేరు ఒక్కటేకాబట్టి.
ఇందులో మాయా - మంత్రం ఏమీలేదు. మీ మిత్రులు పేర్లు చెప్పేటప్పుడు పది రకాల పేర్లు చెప్పినప్పటికి - మీరు మాత్ర వ్రాసేటప్పుడు - అందులో ఏదో ఒక పేరు మాత్రమే అన్నింటిలోను వ్రాస్తారు ! ఆ పేరునే మీ వద్దవున్న కాగితంలో కూడా వ్రాస్తారు ! మీ మిత్రుడు ఏ కాగితం తీసినా మీవద్ద వున్న కాగితంలో పేరే వస్తుంది !