అందరూ ఒప్పుకుంటారు. దీనిని చాటుగా చేసి ఒకేసారి నీటిపై తేలుతున్న సూదిని చూపిస్తే మరింత సరదాగా వుంటుంది.
మీ ఆజ్ఞప్రకారం నడిచే గుండీ
ఒక గ్లాసులో సోడాలోని నీరు పోయవలెను. ఆ నీటిలో ఒక చొక్కా గుండీని వేసినప్పుడు - అది పూర్తిగా మునిగి పోతుంది. దానిని అందరికీ చూపించి - మునిగి పోయిన గుండీని అందరిముందు పైకి రా... అని అజ్ఞాపించండి. అది వెంటనే మీ ఆజ్ఞా ప్రకారం పైకి వస్తుంది. అందరూ చూపిన తరువాత క్రిందికి పో.... అని మరల అజ్ఞా పించండి. మీరు చెప్పిన ప్రకారం క్రిందకి పోతుంది. అలా మీరు చెప్పినట్లు చేస్తున్న గుండీని చూచి, అందరూ మిమ్ముల్ని మెచ్చు కుంటారు.
ఇందులో గొప్ప విసేషం ఏమీ లేదు. సోడా నీటిలో కార్బన్-డై-ఆక్స్తైడ్ వుంటుంది. గుండీ నీటిలో వేయగానే సహజంగా అది నీటిలో మునిగి పోతుంది. కొంత సేపటికి గుండీ చుట్టూ కార్బన్ -డై-ఆక్సైడ్ బుడగలు చేరి దానిని పైకి లేపుతాయి. గుండీ; దాని సహజ పద్దతిలో క్రిందకి దిగుతుంది. మీరు చేయ వలసిందల్లా ఈ చర్యలు జరగటానికి ఒక దానికి ఒక దానికి మధ్య ఎంత సేపు పడుతుంతో గమనించి - ఆ లెక్క ప్రకారం మీరు గుండీని అజ్ఞాపించాలి. చూసే వారికి - మీరు చెప్పింట్లు గుండీ చేస్తున్నట్లుగా వుంటుంది.