ఈ పుట ఆమోదించబడ్డది

మైన పని - సీసాను గట్టిగా పట్టుకోవడమే. అలా మీరు సీసాని గట్టిగా పట్టుకొన్నప్పుడు మీలోని వేడి - సీసా చల్లదనాన్ని వేడిచేసి, సీసా లోని గాలిని వ్యాకోచింప జేస్తుంది. అలా వ్యాకోచించిన గాలి బయటకు పోయే సమయంలో నాణెమును పయికి లేపుతుంది. ఇది చాల మందికి తెలియని విచిత్రము.

నీటిపై తేలుతున్న సూది

మీ మిత్రులతో సరదాగా పందెంకట్టి విజయం సాధించడానికి చాల తేలికైన తమాషా ఇది.

ఒక గాజు గ్లాస్లో నిండా నీరు పోసి , ఒక సూదిని మీత్రుల కిచ్చి, దీనిని నీటిపై తేలేలా చేయమనండి. ఎన్ని సార్లు సూదిని నీటిలో వేసిన అది మునిగి పోతుంది. వారి వల్ల కాక, మిమ్ముల్ని చేయమని పందెం వేస్తారు. మీరు చాల సులభంగా చేసి వరి మన్ననలను పొందగలుగు తారు.

పల్చటి చిన్న ఉల్లిపొర కాగితాన్ని (కొన్ని సిగరెట్ ప్యాకెట్లలో తగరానికి వెనుక భాగాన వుంటుంది) తీసికొని నీటిపై వేయండి. అది తేలుతుంది. దానిపై సూదిని వుంచండి. కాగితంతో పాటు సూది కూడ తేలుతుంది. అయితే దానికి మీ మిత్రులు ఒప్పుకోరు. కాగితం వుండకూడ దంటారు. వెంటనే మరో సూదిని తీసికొని, ఆ కాగితాన్ని నిదానంగా నీటిలో ముంచి - బయటకు తీయండి. కాగితం బయటకు వచ్చినా సూది మాత్రం తేలుతూ వుంటుంది. అప్పుడు