పంచదార లేకుండా టీ తియ్యగా వుండేసరికి ప్రేక్షకులు ఆనందదానుభూతి నందగలరు.
దీనికి ముందుగా ప్రదర్శకుడు తెల్లనిది పల్చగా నున్న ఒక నలుచదరపు గుడ్డను చాక్రిన్ కలిపిన నీళ్లలో నానించి, పిండకుండా ఆరవేసి వుంచాలి. ఆ గుడ్డనే వడపోతకు ఇస్తే ప్రదర్శన రక్తికడుతుంది.
కోడి గ్రుడ్డును వెండిగా మార్చుట?
ప్రదర్శకుడు ముందుగా ఒక గ్రుడ్డుకు దీపపుమసిని దట్టంగా పట్టించి వుంచుకోవాలి. మసి పట్టించని ఒక గ్రుడ్డును ప్రేక్షకులకు చూపి - " నా మహిమతో దీన్ని వెండి గ్రుడ్డుగా మారుస్తానని" చెప్పి - పరీక్షనిమిత్తం ఈ మామూలు గ్రుడ్డును ప్రేక్షకుల దగ్గరకు తన అసిస్టెంట్ ద్వారా పంపాలి. తిరిగి తీసుకొచ్చే సమయంలో చాకచక్యంగా ఆ గ్రుడ్డును మార్చి మసిపట్టిన గ్రుడ్డును ప్రదర్శకుడికి ఇవ్వాలి. ఆ గ్రుడ్డును ప్రదర్శకుడు గాజుగ్లాసులోని నీటిలో వేయగానే అది వెండిలా ధగధగా మెరసిపోతుంది.
ఒకే జాతి పువ్వుకు రెండు రంగులు
ప్రదర్శకుడు ముందుగా పూలచెట్టు నుండి కాండంతో సహా పువ్వును కోసి ఆ పువ్వు యొక్క కాండాన్ని జాగ్రత్తగా మధ్యకు చీల్చాలి. అలా చీల్చిన కాండాలను రెండు వేర్వేరు రంగులు కలిపిన నీటి గ్లాసులలో వేయాలి. ఆ కాండాలు గ్లాసుల నుండి రంగునీరు పీల్చుకొని గంటా రెండు