ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ప్రక్రియ చూపుటకు ముందుగా ఇంద్రజాలికుడు "నీరుగొల్చి" అనే చెట్టుయొక్క విత్తనములను తెచ్చి - బాగా ఎండించి, మెత్తగా పొడిగొట్టి, ఆ పొడిని ఈ విబూదిలో కలిపి వుంచుకోవాలి. సమయం వచ్చినపుడు ఈ విబూదిలో పసుపు కలిపిన నీటిలో చల్లిన ఆ నీటనుండి పసుపు (కలిపినదంతా) - ముద్దగా వచ్చును.

పాలు కాయకుండానే నిమిషాల్లో పెరుగు తయార్

అరటి చెట్టుకు అడుగున భూమిలో వుండే దుంపనుతీసుకొని, ముక్కలుకోసి, బాగా ఎండబెట్టి, మెత్తగా పౌడర్ చేసి వుంచుకోవాలి. సమయం వచ్చినప్పుడు ఒక గిద్దెడు పాలలో తులం పౌడర్ చల్లినచో ఆ పాలు నిమిషాలలో గడ్డపెరుగుగా మారగలదు.

ఎంతసేపు వెలిగినా ప్రమిదలో వత్తి కాలకుండా చేయుట

ప్రమిదలో వత్తి చేయుటకు ముందుగా ఆ వత్తిని మనము వరి అన్నము వండినపుడు వచ్చే గంజిలో నానవేసి తరువాత బాగా ఎండించాలి. ఆ వత్తిని ప్రమిదలో వేసి, నూనె పోసి బాగా తడిపి వెలిగించినచో నూనె ఉన్నంత వరకు వెలుగును. వత్తిమాత్రం అలాగేకాలకుండా వుంటుంది.

వేపనూనె మంచి నెయ్యిగా తయార్

ముందుగా ప్రదర్శకుడు వేపనూనెలో "సహాదేవి" ఆకు [వెన్న ముద్ద ఆకు]ను తెచ్చి పచ్చిదిగానే నూరి; తగు