ఈ పుట ఆమోదించబడ్డది

గాజు పెంకులను నోటితో నములుట

ప్రదర్శకుడు సభికులతో - నేను గాజు పెంకులను నోటితో నమిలి పిండి పిండి చేస్తానని చెప్పి తను సిద్ధంగా వుంచుకొన్న గాజు పెంకులను, పరీక్ష నిమిత్తముగా ప్రేక్షకులకు చూపి - వాటిని నోటిలో వేసుకొని, కసా బిసా పిండి పిండిగా నమిలి వేయాలి. తరువాత దానిని నోటిలో నుండి బయటకు తీసి ప్రేక్షకులకు చూపి - ఈ విచిత్ర మయిన శక్తిని చూచువారు అమితాశ్చర్యాన్ని పొందుటయే గాక, ఆనంద పడగలరు.

ఈ ప్రదర్శనకు ముందుగా - అక్కలకర్ర అనే మూలికను దెచ్చి, దాన్ని బాగా మెత్తగా నలగ గొట్టి, రసాన్ని పిండి, ఆ రసాన్ని - తాను నమలబోయే గాజు పెంకులకు దట్టముగా పట్టించి , ఆరబెట్టి జాగ్రత్త చేసుకోవాలి. గాజు పెంకులను నమలబోయే ముందు కూడ అక్కలకర్ర వేరును నోటిలో వేసుకొని, బాగా మెత్తగా నమిలి - నోటిలోలోపలి భాగమంతా (నోరంతా) మందంగా పట్టించాలి. ఇలా చేస్తే గాజు పెంకులు నోటిలో వేసుకొని నమిలినా - మన కెలాంటి బాధావుండడు.

సన్నమూతిగల సీసాలో కోడి గ్రుడ్లు

ఎంత సన్నటి మూతి గల సీసాలో అయినా కోడి గ్రుడ్డు (ఏ జాతి పక్షి గ్రుడ్డయినా పర్వాలేదు) పట్టు విధానం ఏమి టంటే? ముందుగా కొన్ని గ్రుడ్లు తెచ్చి - ద్రాక్షా సారాయి