కొని ఒక గిన్నెలో పైవిధంగా తయారయిన మిశ్రమం రెండో గిన్నెలో మాములు ఇసుక పోసి ఉంచాలి. సభికులకు చూపించే టప్పుడు మాతరం ఇసుక పోసిన గిన్నెను చూపి, వేడి నీరు పోసేటప్పుడు (గిన్నెలను ప్రదర్శకుని అసిస్టెంట్ గాని, ప్రదర్శకుడు గాని చాక చక్యముగా మార్చ వలసి వుంటుంది) మాత్రం మిశ్రమం పోసిన గిన్నెను వాడాలి.
వేడినూనెలో ఉడికించినా చచ్చిపోని పిచ్చుక
విచిత్రమైన ఈ ప్రదర్శనకు ముందుగా ప్రదర్శకుడు ఒక ఆరోగ్య కరమైన ఊర పిచ్చుకను పట్టుకొని (దానికి రెక్కలు, ఈకలు అన్నీ కూడా రాలిపోనివి అయివుండాలి). దానికి కడుపు నిండా ఆహారం పెట్టి, నీళ్ళు త్రాగించిన తరువాత 10 నిముషాలు ఆగి, దాని ఒళ్ళంతా వైన్ (సారాయి) లో ముంచి దట్టంగా పట్టించాలి. తదుపరి గోధుమ రొట్టెలు పలుచనివి రెంటిని తయారు చేయాలి. ఆ రెండు రొట్టెల మధ్య వైన్ తో తడిపిన పిచ్చుకను పెట్టి జాగ్రత్తగా (కజ్జికాయ మధ్య కొబ్బరి., సెనగ పప్పు మొదలగు వాటితో తొక్కిన ముద్ద పెట్టి మూసే విధంగా రొట్టెల చివరలను మడవాలి. వెంటనే అంతకు ముందే సిద్ధంగా వుంచుకొన్న పొయ్యిమీద భాండీలో వేడిగా కాగి వున్న నూనెలో వేసి, రెండు సార్లు అటు ఇటూ పొర్లించిన వెంటనే తీసి, త్వరగా ఆ రొట్టెలను విడదీయాలి. అప్పుడు అందులో వున్న పిచ్చుక రొట్టెలు విడదీసిన వెంటనే ఎగిరి పోతుంది. ఈ కార్య క్రమాలన్నీ