ర్భంలోనో అరటి కాయలకు కట్టిన దారాలను మెళూకువగా త్రెంచి వేస్తే ..... అవి తెగి క్రింద బట్టమీద పడతాయి. ఇంకా తేలికగా ఈ అరటి కాయలకు కట్టిన దారలను త్రెంచ వలెనంటే సుమారు పది అరటికాయలను కట్టామనుకుంటే - గంప బోర్లించే టప్పుడు 1 - 2 దారాలను, వస్త్రం కప్పేటప్పుడు 1 - 2 దారాలను ఇలా అంచెలంచెలుగా కూడ త్రెంచుతూ జాగ్రత్తగా ఈ ప్రదర్శన ఇవ్వవచ్చును.
ఇసుకతో పసందైన హల్వా
తన మహిమతో ఇసుకను హల్వాగా మారుస్తానని చెప్పి, ఒక చిన్న గిన్నెలో ఇసుకను పోసి, దానిని పరీక్ష నిమిత్తం, తన అసిస్టెంట్ ద్వారా సభికులకు చూపి, వారి దానిని 'ఇసుకే అని చెప్పిన తరువాత తిరిగి గిన్నె తీసుకొని - దానిలో ఉడుకు నీరు పోసి కలియ బెట్టగానే అది అద్భుతంగా హల్వాలాగా మారిపోయి, చూచువారికి దిగ్భ్రమ కలుగుతుంది.
ఈ ప్రదర్శన చేసే ముందు మూడు వంతులు కండ చెక్కెర, బాదంపప్పు (బాదం మసికి) నాలుగున్నర వంతుల కేసరి (కుంకుమ పువ్వు) తగినంత (అంటే కండ చెక్కెర, బాదం కలిపి కిలో (1000. గ్రా) వుంటే కేసరి 50 గ్రాములు వుండాలి) రోటిలో వేసి దంచాలి. ఇలా దంచిన అతరువాత ఆ పొడుము అచ్చం ఇసుకలాగా (గోధుమ రవ్వలాగా) వుంటుంది. దీనిలో వేడి నీరు పోయగానే హల్వా తయారవుతుంది. అయితే ప్రదర్శకుడు రెండూ ఒకే రకం గిన్నెలు తీసు