ఈ పుట ఆమోదించబడ్డది

ప్రదర్శకుడు ముందుగా ఆ విభూతిలో రోజ్ ఎస్సెన్స్ కలిపి జాగ్రత్తగా వుంచుకొని - ప్రదర్శనా సమయములో ఆ బూడిదను వాడాలి.

మంత్రానికి అరటిపండ్లు

ప్రదర్శకుడు తన మంత్ర మహిమచే అరటి పళ్ళను సృజించి ఇస్తానని చెప్పి నేల మీద (స్టేజీ పయిన) ఒక గుడ్డ పరచి, ఆ గుడ్డ మీద తను సిద్ధంగా వుంచుకొన్న బుట్ట (వెదురు గంప) ను బోర్లించి - ఆ బుట్టను పూర్తిగా గుడ్డతో (లేక దుప్పటి, బట్ట నలుపు రంగుది వాడటం మంచిది) కప్పాలి. ఆ తదుపరి మంత్రాలు చదువుతూ (అలా నటించి ) కొంచె సేపు వుండి, గంప పైన కప్పిన పస్త్రమును తొలగించి, గంఫ లేపి పక్కన పెట్టగానే క్రింద పరచిన వస్త్రంమీదకొన్ని అరటికాయలు కనిపించి చూచు వారికి అద్భుతంగా వుంటుంది.

ఈ ప్రదర్శన ఎక్కువ భాగం వాక్ చాతుర్యంమీద హస్తవాఘవం మీద ఆధారపడి వుంటుంది. ముందుగా కొన్ని అరటి పళ్ళకు సన్నని దారములు (తేలికగా తెగేవి) కట్టి, గంపకు లోపల వుండే అడుగు భాగంలో కట్టి, సిద్ధంగా వుంచుకోవాలి. గంప స్టేజి మీద వుండు నప్పుడు, గంపను తీసుకొని వస్త్రం పైన బోర్లించే సమయంలో గంప లోపలి భాగం ప్రేక్షకులకు ఎట్టి పరిస్థితులలోను కనిపించ కుండా జాగ్రత్త పడాలి. తరువాత ప్రదర్శన చేసేటప్పుడు - బోర్లించె సమయంలోనో, వస్త్రం కప్పే సమయంలోనో, వస్త్రం తీసే సంద