ఈ పుట ఆమోదించబడ్డది

చుట్టూ ఉన్న దారము మాత్రము కాలదు." అని చెప్పాలి. వారు వ్రేలాడే దారానికి తగలకుండా నాణెము చుట్టూ ఉన్న దారాన్ని 20 - 30 అగ్గి పుల్లలతో కాల్చినా ఆ దారం కలదు. ఈ ప్రక్రియ చాల వింతగా వుంటుందు.

చిటికెలో సంకెళ్ళు ఊడిపోవుట

ప్రదర్శకుడు, ప్రేక్షకులతో - మీలో ఎవరయినా సరే ఎంత బలమయిన సంకెళ్ళు నాకు వేసినా క్షణంలో వాటిని విడిపించు కొంటానని చెప్పాలి. వారు ఎటువంటి సంకెళ్ళు వేసినా క్షణంలో ఊడదీసుకొని అందరిని ఆశ్చర్య పరచ వచ్చు.

ఈ ప్రదర్శనకు ముందుగా పెద్దమందాకు పాలు, జువ్వి పాలు, జెముడు పాలు, మర్రి పాలు, జిల్లేడు పాలు, మేడి పాలు సమపాళ్ళలో తెచ్చి, అన్ని కలిపి ఒక తెల్లని గుడ్డ (జేబు రుమాలు) - ఆ పాలలో ముంచి, ఆర బెట్టి, ముంచి ఆరబెట్టి - ఇలా 5 - 6 సార్లు చేసి - ఆ గుడ్డను జాగ్రత్త చేసుకొని ప్రదర్శన సమయంలో దానిని మంత్రించి ( అలా నటించి), సంకెళ్ళు తొడిగిన చేతి పైన వేసినచో సంకెళ్ళు వెంటనే వూడిపోతాయి.

(ప్రస్తుత కాలంలో ఇది చాల కష్ణ సాధ్యం)

నీళ్ళతో నెయ్యి తయార్


ప్రదర్శకుడు సభికులతో - నెయ్యి ఈ రోజులలో కిలో 80 రూపాయల దాకా వుంది. నేను నీటితో నెయ్యి చౌకగా తయారు చేస్తానని చెప్పి - తన వద్ద సిద్ధంగా వుంచుకొన్న సబ్జాగింజల పొడిని తగు మాత్రం నీటిలో వేసి బాగా త్రిప్పాలి.