చేసుకొన్న పెన్నేరు గడ్డ పొడిని కొంచెం వేసి బాగా తిప్పగానే అపాలు చిక్కగా గడ్డ కడతాయి. అప్పుడు దానిలో లక్టిక్ యాసిడ్ ఒక చుక్క వేస్తే చక్కని గడ్డ పెరుగు తయారవుతుంది.
శరీరం అగ్ని జ్వాలల్లో కాలదు
ఉప్పి చెట్ల మధ్యలో వున్న పుట్ట మట్టి, ఉరుములు - మెరుపుల కాలంలో పుట్టుకొచ్చే పుట్టగొడుగులు (పుట్ట కొక్కులు) కలిసి ఒక క్రొత్త కుండలో వేసి గట్టిగా మూత పెట్టి వుంచాలి. కొంత కాలానికి ఒక విధమైన తైలము వాటి నుండి వస్తుంది. దాన్ని ఒక సీఆలో భద్ర పరచి ప్రదర్శన సమయంలో ఒంటికి పూసుకొని, మంటలో ప్రవేశించినా శరీరం కాలదు. ఇది చూసిన వారు చాల ఆశ్చర్య పడతారు.
బాధాకరమైన పంటి నొప్పి చిటికెలో మాయం
తగినన్ని మోదుగు మాడలు తెచ్చి బాగా ఎండబెట్టి ఇనుప మూకుడులో (బాండీలో) వేసి బాగా వేయించి, మెత్తగా చూర్ణం చేసి, పలుచని గుడ్డలో వేసి గాలించిన పౌడర్ ను ప్రదర్శన సమయంలో మహిమ గల్గిన విభూతిగా చెప్పి, చిటికెడు పౌడర్ పంటి నొప్పి వున్న చిగురుకు పట్టించిన, క్షణంలో నొప్పి మాయమవుతుంది. ఈ పొడి నాలుక మీద వేసిన చురుక్కుమని మంట పుట్టును.