ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ప్రదర్శనకు ముందుగా పీచు వలవని పచ్చి కొబ్బరి కాయను కొత్త సున్నం నీటిలో 10 - 15 రోజులు నాన బెట్టాలి. తరువాత ఆ కొబ్బరి కాయను ఎండించి, భద్రపరచుకొని, ప్రదర్శన సమయంలో వినియోగించాలి.

నీళ్ళతో పేలాలు

ఇంద్ర జాలికుడు ప్రేక్షకులతో మీరందరూ పొయ్యిమీద బాండీ పెట్టి,. మంట చేసి పేలాలు తయారు చేస్తారు. కాని నేను మాత్రం నామహిమతో నిప్పు - పొయ్యి లేకుండా నీళ్ళతో మాత్రమే పేలాలు తయారు చేస్తానని చెప్పి - వడ్లు, గోదుమలు ఏవైనా సరే సిద్ధంగా వుంచినవి తీసుకొని వాటిపై మంత్ర జలం (మంత్రజలంలా నమ్మించి) చల్లగానే అవి పేలాలుగా మారి సభికులను ఆశ్చర్య చికితులను చేసి వేస్తాయి.

ముందుగా పొట్టు వలవని ధాన్యం (వడ్లు, జొన్నలు, గోదుమలు) మొదలగునవి తీసుకొని సున్నం బట్టీలో గుంట తీసి పాతి పెట్టాలి. సున్నం బట్టి చల్లారిన తరువాత వాటిని తెచ్చి భద్రపరుచుకొని ప్రదర్శన సమయంలో ఉపయోగించాలి.

క్షణంలో బ్రాంది

వేడి వేడి నీళ్ళలో ఇప్పపూలు మంచివి- పది పూలు వేసి నా మహిమతో ఇప్పపూలు బ్రాందీగా తయారు అవుతాయి అని చెప్పాలి. కొద్ది సేపు తరువాత పూలు తీసి వేసి అ నీరు ప్రేక్షకులకు పోస్తే అవి త్రాగగనే బ్రాందిలాగ వుండి వారు చాల అబ్బుర పడతారు.