ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

మహర్షుల చరిత్రలు


తప్పదు. నాకును దప్పలే"దని బృహస్పతి యందఱ నోదార్చెను. శని యటఁ బ్రత్యక్షమై గురుపాదములఁ బడి క్షమింప వేఁడుకొనెను. దేవగురు వాతని నాదరించి యుత్తముల జోలికిఁ బోవల దని హెచ్చరించి వీడుకొలిపెను.*[1]

బృహస్పతిస్మృతి

బృహస్పతి చెప్పినధర్మము లన్నియు “బృహస్పతిస్మృతి " యను పేర విలసిల్లుచున్నవి. ఇంద్రుఁడు బృహస్పతిని జేరి భయభక్తులతోఁ దనకు ధర్మములు చెప్పు మని ప్రార్థించుటయు బృహస్పతి కరుణించి యాతనికి ధర్మములు వివరించె ననియు నిందుఁ గలదు.

బృహస్పతిస్తుతి

"నమ స్సురేంద్రవంద్యాయ
           దేవాచార్యాయ తే నమః,
 నమస్తే౽నంత సామర్థ్య
           వేదసిద్ధాంతపారగ !
 సదానంద నమస్తేస్తు
           నమః పీడాహరాయ చ,
 నమో వాచస్పతే తుభ్యం
           నమస్తే పీతవాససే.
 నమో౽ద్వితీయరూపాయ
           లంబకూర్పాయ తే నమః,
 నమః ప్రహృష్ట నేత్రాయ
           విప్రాణాం పతయే నమః.

  1. *శివపురాణము, సనత్కుమార సంహిత.