60
మహర్షుల చరిత్రలు
ఈ లోఁగా బృహస్పతి శుక్రాచార్యరూపము ధరించి రాక్షసులకడ కేగి వారు తమగురువే యని నమ్మి సేవింప, వారికి వేదబాహ్య మగు ఆర్హ తమతము ని ట్లుపదేశించెను. “ వేదశాస్త్రములు వట్టిబూటకములు; వాదములకు భేదములకు నవి పనికివచ్చుఁ గాని ముక్తి నీయఁజాలవు. యజ్ఞములపేరఁ జేయుప్రాణిహింస, సురాపానము మిగుల గర్హ్యములు. యజ్ఞమునఁ జంపఁబడిన పశువునకు మోక్షము వచ్చునఁట. అగుచో, యజ్ఞకర్త తనతండ్రినో తల్లినో యజ్ఞపశువుఁ జేసి మోక్ష మిప్పింవరాదా? ఒకఁడు పెండ్లమును నెత్తి కెక్కించుకొన్నవాఁడు; ఇంకొకఁడు వక్షఃస్థలమున నుంచుకొన్న వాఁడు; మఱొక్కఁడు నోటిలో నుంచుకొన్న వాఁడు. ఈ మువ్వురు మోక్ష ప్రదాత లఁట! చిత్రము కాదా?
మీకు నేను గొప్పమత మొకటి బోధించెదను. దానిని మీ రనుసరించితిరా మీకు మోక్షము కలుగును. అదియే ఆర్హత మతము. ఇందు శిఖాయజ్ఞోపవీతము లెల్లరును ద్యజింపవలయును. ఆచారము మానవలెను. దిగంబరులై యథేచ్చముగ నుండవలయును. జాతి మతభేదము లుండరాదు."
ఇట్లు చెప్పి బృహస్పతి రాక్షసు లెల్లరకు ఆర్హతమతము నిప్పించి వారిని ధర్మబాహ్యులను వేదబాహ్యులను గావించెను. ఈ సందర్భమున నిజముగ శుక్రాచార్యుఁడు తనశిష్యులకడకు వచ్చెను. కాని, బృహస్పతిమతము తల కెక్కినరాక్షసులు వానిని నమ్మక ద్రోహియని పాఱఁదోలిరి. బృహస్పతి రాక్షసులను సర్వభ్రష్టులను జేసి యరిగిన పిదప, రాక్షసులు తాము మోసపోయిన సంగతి గ్రహించి ప్రహ్లాదపుర స్కృతులై శుక్రాచార్యునిఁ బ్రార్థించి క్షమింప వేఁడుకొనిరి. ఎట్టకేల కాతఁడు శిష్యవాత్సల్యమున వారి కిచ్చినశాపమున కవధి యేర్పఱిచి యాదరించెను. *[1]
బృహస్పతి మమతం గూడుట
బృహస్పతి పన్నిన కుటిలనీతిమూలముగాఁ దనశిష్యులు తన్నుఁ దృణీకరించి యవమానించిరని దానికిఁ గారకుఁ డగు బృహస్పతి
- ↑ *పద్మపురాణము, బ్రహ్మాండ పురాణము