ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదంకమహర్షి

25


చూపుము. దాన నా మనస్సు, చూపు, జన్మము ధన్యములు కాఁగా జన్మరాహిత్య మందెద" నని ప్రార్థించెను .

శ్రీకృష్ణుఁడు దయదలఁచి యర్జునునికిఁ జూపిన విశ్వరూపము ఉదంకునకుఁ జూపెను. వెంటనే ఉదంకుఁ డాశ్చర్యభయభక్తులతోఁ జేతులు మోడ్చి “నమః పురుషో త్తమాయ తే" యని నిలిచి గద్దదస్వరముతో "దేవా! పుండరీకాక్షా! నీ పాదము లీ భూమియంతయు వ్యాపించినవి. నీ చేతు లాకసము నాక్రమించినవి. ఆకాశము నీ కడుపుతో నిండిపోయినది. దిశ లన్నియు నెచ్చటఁ జూచినను నీ చేతులతో నిండి పోయినవి. ఇన్నిచరణములు, ఇన్ని తలలు, ఇన్ని హస్తములతో నన్నియు నీ వైతివి. ఈ నీ విశ్వరూపము నా కన్నులను మనస్సును దన్పినది. విశ్వరూపా ! ఈ రూప ముపసంహరింపుము" అని కోరెను. "నీ కే వరము కావలయునో కోరుకొను” మని యా పరమేశ్వరుఁ డనెను. “నీ దివ్యరూపముఁ జూచితిని. జన్మము ధన్య మయ్యెను. ఇంక నా కేమియు వల" దని యుదంకుఁ డనెను. “ అట్లు కాదు. నన్నుఁ గన్న వారికి శుభ మీయక పోను. ఏది కావలయునో వెంటనే కోరుకొను మిచ్చెద" నని యా దేవాదిదేవుఁ డత్యాదరముతోఁ బలికెను.

“అగుచో దేవా ! లోకహితమే ఆత్మహితము. కానఁ గోరెద. ఇది మరుదేశము. ఇచట జల మెప్పుడును దుర్లభము. కావున, ఈ ప్రదేశమును జలయుక్తము చేయు" మని యుదంకుఁడు రోరెను. శ్రీకృష్ణుఁడు విశ్వరూప ముపసంహరించి “నన్నుఁ దలంచినపుడు నీకు జలములు లభించు” నని వర మిచ్చి యంతర్హి తుఁ డయ్యెను.

ఒకనాఁ డుదంకుఁడు దప్పిగొని శ్రీకృష్ణుని స్మరించెను. వెంటనే యొకమాలవాఁడు బాణబాణాసన పాణియు, దిగంబరుఁడు, మలినాంగుఁడు నయి కుక్కలు తన చుట్టు చేరి రాఁగా, ఒడలెల్ల నీరు చిమ్ముచుండ నుదంకుని జేరి "అయ్యా! నీరు త్రావి దప్పి పోఁగొట్టుకొను” మనెను. వానిని "వలదు. పొ మ్మని” యుదంకుఁ డదల్బెను . ఓయీ "నీ మీఁదిదయతో వచ్చితిని, త్రావు” మని మరల ననెను. ఉదంకుఁ డాతని నలుకతోఁ బో పొమ్మని కసరెను, వాఁడు కుక్కలతో నంతర్ధాన