పుట:MaharshulaCharitraluVol6.djvu/25

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

20

మహర్షుల చరిత్రలు

ఋతువులు. ఆ గుఱ్ఱము అగ్ని. ఆ పురుషుఁ డింద్రసఖుఁ డగుపర్జన్యుఁ తొలుతనే యింద్రునిఁ గాంచి యమృతముఁ దిన్నవాఁడ వగుట కి పను లన్నియు అవలీలగా జరిగినవి. నీ వలన మా కానందమైన గురుఋణము నిట్లద్భుతముగా నీవు తీర్పఁ గంటివి. నీవు నీ యిష్టము వచ్చినట్లుండుము.

“కర మిష్టము సేసితి మా
కరిసూదన ! దీన నీకు నగు సత్ఫలముల్
గురు కార్యనిరతు లగు స
త్పురుషుల కగు టరుదె ! యధిక పుణ్యఫలంబుల్.”

భార. ఆది. ౧. ౧

ఉదంకుఁడు నమితానందమున గురుని వీడ్కొని గురుపత్ని సె-గైకొని భార్యాసహితుఁడై యేఁగి స్వీయాశ్రమమును నిర్మించు-యటఁ దపోగృహస్థజీవన మారంభించెను.[1]

తక్షకుఁడు తన కకారణముగ నొనర్చిన యవకారము నుదంకుఁడు మఱవక దానికిఁ బ్రతీకారము చేయఁ దలఁచి జనమేజయునిపాలి కేగి- మహారాజా ! తొల్లి నే గురుకార్యముఁ జేయఁ బూని వెళ్లఁగా- | కుటిలస్వభావుఁడు, వివేక విహీనుఁడు నగు తక్షకుఁ డకారణముగా నన్ను బాధించెను. మఱియు, నీ తండ్రి యగు పరీక్షిత్తు చనిపోవుట కాదుర్మార్గుఁడే కారణము. కావున, నీవు సర్పయాగము చేసి యా దుర్మార్గుని కాక యా దుర్మార్గవంశము నంతను నశింపఁజేసి పుణ్యము గట్టుకొన మని హెచ్చరించెను.

జనమేజయుఁడును గోపోద్దీపితుఁడై బ్రాహ్మణులఁ బిలిపించి తాను సర్పయాగము చేసెదనని ఋత్విజులఁ బిలిపించి కావలసిన యేర్పాటులన్నియుఁ గావించెను. యాగ మారంభమై హోమము జరగుచుండఁగా సర్పరాజు లందఱు వచ్చి యందుఁ బడి చచ్చుచుండిరి తక్షకుఁ డతిభీతుఁడై యింద్రునిఁ బ్రార్ధించెను. తుదకు ఆస్తీకుఁడు- మహర్షి జనమేజయుని ప్రార్థించి నివారించుట చే యాగ మాగిపోయెను.

  1. భారతము; ఆదిపర్వము; అశ్వమేధపర్వము.