పుట:Maharshula-Charitralu.firstpart.pdf/79

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఋష్యశృంగ మహర్షి

63


పాయసము కౌసల్యకు సగమును మిగిలినసగములో సగము సుమిత్రకును మిగిలినదానిలో సగము కైకకును ద్రావ నిచ్చి యవశిష్టమయిన యష్టమాంశమును మరల సుమిత్రకు నీయ దానిని వారు మువ్వురుఁ బ్రీతిమెయిఁ గ్రోలిరి. దీనిమూలముననే తరువాత గొంతకాలమునకు వారికిఁ గ్రమముగా శ్రీరామ భరతలక్ష్మణ శత్రుఘ్ను లుదయించిరి. పరమశోభాయమానమై యాగము సాంతము కాఁగా ఋష్యశృంగుఁడు శాంతాసహితుఁడై విభాండకుని యాశ్రమమునకుఁ బోయెను. విభాండకుఁడు పుత్త్రుని జగద్ధితమతి నానాఁడే దివ్యదృష్టిఁ దెలిసికొని యుండెఁ గావునఁ గొమరుని గోడలి నెంతయు నాదరించెను. వసిష్ఠున కరుంధతివలె, అత్రి కనసూయవలె, అగస్త్యునకు లోపాముద్రవలె శాంతయు ఋష్యశృంగుని సేవించి చతురంగుఁ డను నుత్తమపుత్త్రునిఁ గనెను.[1]

ఋష్యశృంగుని ద్వాదశవార్షికయాగము

తరువాత ఋష్యశృంగుఁడు కొంతకాలమునకు ర్వాదశవార్షికయజ్ఞము నిర్వర్తించెను. ఆ యజ్ఞమునకుఁ జూలాలైన సీతయు నామె ప్రియమునకై శ్రీరాముఁడు నతనికై లక్ష్మణుఁడు నుండి పోవుటచే వారుదక్క నందఱును విచ్చేసిరి. శుభయజ్ఞ పరిసమాప్తి యైనవెనుక నందఱు వెడలిపోయిరి.[2]

ఋష్యశృంగ స్మృతి

ఋష్యశృంగమహర్షి యొక్కస్మృతి కర్తగాఁ గాన వచ్చుచున్నాఁడు. ఆచారాశౌచ శ్రాద్ధ ప్రాయశ్చి త్తమునకు మితాక్ష రావరార్కస్మృతి చంద్రిక లీ స్మృతినుండి తత్సంబంధ శ్లోకముల నుదాహరించినవి. మితాక్షరమున శంఖుని దని పేర్కొనఁబడిన యొక శ్లోక

  1. రామాయణము.
  2. ఉత్తరరామాయజాము.