పుట:Maharshula-Charitralu.firstpart.pdf/155

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

దధీచి మహర్షి

139


నయనుఁడై వారి యాశీర్వచనము లంది యేకాకియై మహోగ్ర తప మొనరింపఁ జొచ్చెను. ఆతని బ్రహ్మచర్య దీక్షకును దపోనిరతికిని ముల్లోకము లచ్చెరువందెను. ఏ తత్పలితముగా నాతఁ డేలోకమునఁ గావలసిన నాలోకమునఁ దలఁచిన మాత్రముననే తిరుగఁ గల సామర్ధ్యము సంపాదించెను. అతని దివ్యతేజముఁ గాంచి సురయక్షకిన్న రాదులు జోహారు లొనర్చుచుండిరి. ఈరీతి ననంతశక్తి సంపన్నుఁడై దుర్వాసుఁడు నిజతపోగరిమఁ ద్రిలోకములఁ జరించుచుండెను. పిదప, నీతఁడు తలిదండ్రులను సర్వసంగములను విడిచి, “ఉన్మత్తము" అను. మత్తమవ్రత మవలంబించి తిరుగుచుండెను.

దుర్వాసుఁ డింద్రుని శపించుట

ఒకనాఁడు దుర్వాసుఁడు విష్ణుమూర్తిని దర్శించి యాతని యాశీస్సుల నంది యాతఁ డాదరపూర్వకముగా నిచ్చిన పారిజాత ప్రసూనమును, మార్గమధ్యమున వింజ్యాధర కాంతలు సభక్తికముగా నిచ్చినపుష్పమాలికలును నిజహస్తమున సుంచుకొని తిరిగి వచ్చు చుండెను. దేవేంద్రుఁడై రావతము నెక్కి నందనోద్యానవిహారా నంతరము తిరిగి వచ్చుచు నాతని కెదురయ్యెను. దుర్వాసో మహర్షిని గన్నంతనే యింద్రుఁడు పలుకరించి నమస్కార మొనరించెను. దుర్వాసుఁడు తనచేత నున్న పుష్పమాలికల నాతనికి బహుకరించెను. ఇంద్రుఁడు వానిని గైకొనియుఁ గొంతనిర్లక్ష్యముగా నై రావతము శిరముపై నా దండల నుంచెను. ఐరావతము - తన తొండముతో నా మాలికలు లాగి చించి పాఱవైచను. దుర్వాసుఁడది చూచి యింద్రు నుద్దేశించి "ఓరీ ! దుర్మదాంధా ! పరమపవిత్రమును విష్ణు ప్రసాదము నగు మాలికను నీకు బహూకరింప నింతనిర్లక్ష్యముతోఁ గైకొందువా? మదోన్మత్తుఁడవై యొడ లెఱుంగని నిన్నూరక