పుట:Maharshula-Charitralu.firstpart.pdf/154

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహర్షుల చరిత్రలు

దుర్వాసో మహర్షి[1]

దుర్వాసుని జననప్రకారము

దుర్వాసుఁ డత్రిమహర్షి నిరుపమాన తపఃఫలము, త్రిమూర్తు లనసూయ కొసంగిన వరప్రసాదము. ఈతఁడు శివాంశ సంజాతుఁడు. హైహయుఁ డను రాజొకఁడు దుష్టుఁడై అనసూయకు గర్భనిరోధము కావించెను. ఇది యెఱంగి యా రాజును నిర్దగ్ధుం జేయఁ దలఁచి దుఃఖము, కోపముఁ దాల్చి గర్భావాసమున నేడుదినములుండి దుర్వాసుఁ డను నామమున రుద్రుఁడు తమోగుణోద్రిక్తుఁడై యవతరించెను. వెంటనే యాతని తేజోంశమున హైహయుఁడు భస్మమయ్యెను.

  1. దూర్వాసమహర్షి, దుర్వాసమహర్షి అను రూపములు వాడుకలోఁగలవు. కాని, అవి వ్యాకరణదుష్టములు, దుర్వాసో మహర్షి యన్నదే వ్యాకరణయుక్తము. శ్రీ మార్కండేయపురాణము. కాని

    సీ|| ప్రజలదైత్యులు పురత్రయనాయుకులు జగత్త్రయము నప్రతిమప్రతాపలీల

    బాధింప దివిజాలు ఫాలలోచనుఁగాంచి కావుము కృప దేవ దేవ మమ్ముఁ బశువుల మగువారిఁ బశుపతివైన వీ వనుచు మహాక్రోశమాచరింప నప్పురంబులు మూటినస్త్ర మొక్కట భస్మముగాఁగఁజేసి యమ్మార్గణంబు

    గీ|| నంతమున నిడ పది బాలుఁడైన నీతఁ
         డెవ్వఁ డని చూచి వెఱఁ గంది యెల్ల సురలు
         వినతి సేయ బ్రాహ్మణమూర్తి వెలుగు వవని