పుట:Maharshula-Charitralu.firstpart.pdf/124

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

మహర్షుల చరిత్రలు


దప్పువట్టి నీ వంశ క్షయమునకై శపించుటకే. కాని, నీవు నాపరీక్షల కాఁగితివి. మీ యుభయులయందును ధైర్యహాని, కోపము, శోకము మందునకైన లేవు. కావున దయదలఁచి యిట్లు స్వర్గమునే భూమిపైఁ జూపితిని. నీకు మూఁడవ తరమువాఁడు బ్రహ్మ తేజో దీప్తుఁ డయి పుట్టును, నా తనయుని తనయుఁడు ఋచీకుఁడు నీతనయుని గాధి-కూఁతుఁ బరిణయమై జమదగ్ని యనువానిం గని యాతని యఁదు సమస్త ధనుర్వేదమును నిలుపును మహాక్షాత్త్రముతో నాతనికిఁ బుత్త్రుఁడై పరశురాముఁడు జన్మించును. గాధికి బ్రహ్మర్షి యగు విశ్వామిత్రుఁడు జన్మించు" నని చెప్పి చ్యవనమహర్షి వెడలి పోయెను. కుశికభూపతి బ్రహ్మానందము నందెను. చ్యవనమహర్షి చెప్పినట్లే ఋచీకుని మూలమున భార్గవవంశమున జమదగ్నియు నాతనికిఁ బరశురాముఁడును గుశికవంశమున విశ్వామిత్రుఁడును జన్మించిరి.[1]

పా మొకటి చ్యవనుని పాతాళమున కీడ్చుకొనిపోవుట.

తొల్లి యొకప్పుడు చ్యవనుఁడు నర్మదానదిలో స్నానము చేయుచుండఁగా నొక పెద్ద పా మాతనిం బట్టుకొని పాతాళలోకమున కీడ్చుకొని పోవుచుఁడ మౌని పరమేశ్వరుని ధ్యానించెను. దైవకటాక్షము వలన నాతని కేమియు విష భాధ కలుగదాయెను, ఇంతలోఁ బా మాతనిఁ బాతాళమునకుఁ దీసికొనిపోయి నాగకన్యకల నడుమ విడిచెను. ఉరగాంగన లాతనిని భక్తి యుక్తి సేవింపఁ దొడఁగిరి.

అపుడు పాతాళమును బాలించు ప్రహ్లాదుఁ డాతనిం గాంచి నమస్కరించి తనగుట్టుమట్టులఁ దెలిసికొనిరా నీతని నింద్రుఁడు పంపియుండు నని తలంచి తన యనుమానమును వెల్లడించెను.

  1. భారతము - ఆనుశాసనికపర్వము.