పుట:Maharshula-Charitralu.firstpart.pdf/117

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ్యవన మహర్షి

101


గల్గితినేని నాపుట్టువు చరితార్థమగుఁగదా! కావునఁ దప్పక మీరట్లొనర్పుఁ" డని సమ్మతించెను. అందుల కెంతయు నానందించి యచ్చటనే యా బ్రహ్మర్షికిఁ దనకూఁతు నిచ్చి పరిణయముచేసి సైన్య సురోధముఁ బాపికొని సుకన్యనట విడిచి సంయాతి తన సగరమునకుఁ బోయెను.

సుకన్య తనకు ఋషిశ్రేష్ఠుఁ డగు చ్యవనుని సేవాభాగ్యము లభించినదని మహోత్సాహముతోఁ బరిచర్య చేయుచుండెను. తాను యువతి యయ్యు సుకన్య వయోవృద్ధుఁడు జీర్లాంగుఁడు నైనను నిజ భర్తయే పరమదైవమని యాతని నారాధించుచుండెను. ఆమె భర్త యనుగ్రహమున నాత్మానందమును గుర్తెఱిఁగి తుచ్చదేహ వాంచోపహత గాక పరమ పవిత్రజీవితమును గడుపుచుండెను.

చ్యవనుండు నవయౌవనుఁ డగుట

ఇట్లుండఁగా నొకనాఁడాశ్వినేయు లీమె సౌందర్యమును విని యచ్చెరువంది చ్యవనాశ్రమమునకు వచ్చి యొంటరిగ నున్న సుకన్యఁ జూచి యామె నామధేయాదుల నడిగి పలుకరించిరి. సుకన్య తాను సంయాతి కూఁతుర ననియు చ్యవనమహర్షి భార్య ననియుఁ జెప్పెను. అంత వారు కాంతా! త్రిలోకసుందర మగు నీశరీరము నట్టిముసలి వగ్గున కిచ్చుటచే నీకుఁ గొమభోగానందము సంభవించుచున్న దా" ? ఇఁక'నై నను నీ సౌందర్యము నడవిని గాచిన వెన్నెల కానీయకుము. పరమ సుందరు నొకనిఁ గోరుకొమ్ము. మేము తీసికొనివత్తు మనిరి. అంత సుకన్య “మహాత్ములారా! మీకు నాపై నింత యాదరమేల కలిగినదో యెఱుఁగను. పరమపాపనమగు నాపతి పాదసేవ కితోధికమగు భక్తి శ్రద్ద లొసంగ మీరు సమర్థులేని య ట్లొసంగుఁడు. లేని నాఁడు మీదారిని మీరు పొం" డని బదులు చెప్పి నాథునికడ కేఁగి యావిషయమును దెల్పెను. ఆతఁడు వారు చెప్పినట్లే చేయు మని