పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/98

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


పజేయుచుండిరి. ఇది నాకద్భుతముగాంచెను. నేనా గుంపులోనికి తోసికొని వెళ్ళి ఆలయము ప్రవేశింప లేక పోతిని. కావున దూరమునుండి చూడగలిగినంత వరకు చూచివచ్చితిని.


పిమ్మట మిర్జాపురము వద్దనుండి స్టీమరెక్కి ఇంటికి మరలి వచ్చితిని, కాశినుండి వచ్చునప్పుడు నా ఆనంద చంద్రుని వెంట బెట్టు కొని "కుమారాలీ" వరకు వచ్చితిని.. అక్కడ నాజమీందారీని చూచి కొని కలకత్తాకునచ్చి యిల్లు చేరితిని. కొలది కాలము పిమ్మటనే తక్కిన విద్యార్ధులందరు కూడ తిరిగి వచ్చి సమాజ కార్యమునందు దీక్షవహిం చిరి. లాలాహజారిలాల్ కాశీ నుండి రిక్తహస్తముల - దూరదూర ప్రదేశముల లోనికి మత ప్రచారము కొరకు బహిర్గతుడయ్యెను. ఒక్క ఉంగరము మాత్రమతనివద్ద నుండెను. దానిమీద హిందీ భాషలో “ఇదికూడ నిలచి యుండదు” అని చెక్కబడి యుండెను. ఇట్లు బయలు వెడలి మరల ఎన్నడును అతడు తిరిగి రాలేదు. నేనాతని మరల కలసి కొనలేదు.'

పదునెనిమిదవ ప్రకరణను


వేదములలోని అపరావిద్య కేవలము దేవతలకు చేయవలసిన యాగయజ్ఞములను గూర్చియే యను నిశ్చయ సిద్ధాంతము నందు పునీతుడ నైతిని. ఋగ్వేదములోని హోత యజ్ఞమునందు దేవతలను పొగడుచుండును; యజు స్వేదములోని అధ్యర్యుడు యజ్ఞమున దేవతలకు హవిస్సునర్పించును; సామ వేదములోని ఉదలఁడు యజ్ఞమున దేవతల మహిమను గానము చేయును. వేదములలో మొత్తము 33 గురు దేవతలుగలరు, వారందరిలో అగ్ని, ఇంద్రుడు, మారుతుడు, సూర్యుడు,