పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/77

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాల్గవ ప్రకరణము

65


అని కేకలు". కానిఎక్కడను కత్తిదొరకదయ్యెను. కడకొక బండకత్తితో నెవరో పై కెక్కిరి. ఎన్ని యోసారులు దెబ్బ మీద దెబ్బ కొట్టినను ఆ మొండి కత్తితో అది తెగదాయెను.విశేషకష్టముమీద ఒక తాడు తెగెను. ఇంకొక టి, మరియొకటి కూడ క్రమముగా తెగెను. రాజనారాయణ బాబు, నేను నిశ్శబముగా నీటివంక చూచుచుంటిమి. ఈక్షణమిక్కడ నున్నాము, మరుక్షణము మన మెవర మో! జీవన మరణము లెప్పుడును తోడునీడ లై సంచరించుచుండును. రాజ నారాయణ బాబు చక్షువులు స్థిరముగనుండెను, వాక్కు స్తబ్ధమయ్యెను,శరీరము కొయ్య బారెను, పడవవాండ్రింకను తాటిని గోయుచుండిరి. మరి యొక గాలి విసరెను. “ఇదిగో ఇదిగో” యనికేకలు వైచుచు పడవ వాండ్లు మిగిలిన త్రాళ్ళను తెంపిరి.ఇట్లు విడుదల చేయబడి పడవ వేగముతో పోయియెదుటి వడ్డును చేరి నిలచిపోయెను. వెంటనే నేను పడవనుండి ఒడ్డునకు దిగితిని. 'రాజనారాయణ బాబునుకూడ చేయూతయిచ్చి దింపితిని.మేము సురక్షితముగా ఒడ్డునకు దిగితిమి. కాని ఉంగీమాత్ర మింకను విసురుగనే పోవుచుండెను. “ఆపు, ఆపు” మని పడవవాండ్రు కేకలిడిరి. అప్పటికి సూర్యు డస్తమించెను. మేఘచ్ఛాయతో సంధ్యారాగముగలయుటచే చీకటిగా నుండెను. డింగీ ఆగినదో లేదో అంధకారములో కనుగొన లేకపోతిమి. మరియొక వైపునుండి మాపడవవైపున కింకొక పడవ వేగముగా వచ్చుచుండెను. చూడచూడ నాపడప త్వరలో మమ్ముచేరెను. " ఇదేమి, బందిపోటు దొంగల పడవై యుండు నా”, అనుకొంటిని, పడవలోనుండి యొక డొడ్డునకు దుమికెను. ఆతడుమాయింటి నౌకరు స్వరూప్. అతని ముఖము శుష్కించియుండెను.అతడు నాకొక ఉత్త రమిచ్చెను. ఆయంధ కారములో చాలకష్టముమీదదానిని చదువగలిగితిని. చదువగల్గిన దాని బట్టి జూడ నందు మాతండ్రి గారి మరణవార్త యున్నట్లు తోచెను. “కలకత్తాయంతయు తలక్రిం