పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/68

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

మహర్షి దేమే ద్రనాధశాకూర్ స్వీయచరిత్రము.


పట్టి యుండజాలకున్నాను. నీవునా హృదయము నందు చిరస్థాయి వగు దువుగాక ! ఈమాటల నుచ్చరించు నపుడు అరుణకిరణములవలెనాతని ప్రేమ కాంతులు నాహృదయమును వెల్గొందసాగెను. మృత దేహ ముతో, శూన్యహృదయము, విషాదాంధ కారములో నిమగ్నుడనై యుంటిని, ఇప్పుడు ప్రేమభానునిఅభ్యుదయములో నాహృదయము చేత నాత్మకమయ్యెను. నాదీర్ఘ నిద్రభంగనుయ్యెను. నేనిప్పుడు ప్రేమ పథ హలికుడ నై తిని. అతడునా ప్రాణమునకు ప్రాణమనియు, హృ దయ సఖుడనియు ఇప్పుడు తెలిసికొంటిని. అతడు లేనిదే నేనొక్కక్షణ మైనను గడప లేకపోతిని,


పడమూఁడవ ప్రకరణము.

1845 సంవత్సరములో వైశాఖమాసమునందొక ప్రాతః కాలమున వార్తాపత్రికలు చదువుచు కూర్చున్న సమయమున, Bank గుమాస్తా రాజేంద్రనాధ సర్కారు కన్నీరు కార్చుచు నావద్దకు వచ్చిఇట్లు చెప్పసాగెను: “కిందటి ఆదివారము నా భార్యయు నాకనిష్ట భౌతయగు ఉమేశ చంద్రుని భార్యయు బండిలో నొక సభకు పోవుచుండ గా ఉమేశ చంద్రుడువచ్చి తన భార్యను బండిలో నుండి బలవంతముగా లాగికొనిపోయి క్రైస్తవులగుటకు డఫ్ దొర {Dr. Beff) ఇంటికి పోయెను. వారినింటికి మరలించుటకు మాతండ్రి చాల ప్రయత్నము చేసి విఫల మనోరధుడై, ఉన్నత న్యాయస్థానములో అభియోగము తెచ్చెను. కాని ఆయభియోగమును కొట్టి వేసిరి. అప్పుడు రెండవసారి అభియోగము తెచ్చెదమనియు, దానితీర్పు అగునంతవరకు క్రైస్తవులలో కలపవలద నియు నేనుపోయి డాక్టరు డఫ్ ను వినయముతో బ్రతిమాలు కొంటిని