పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/218

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్ర



దీనిని మలినమును, కలుషితమును గావించును. అయినను ఎందుల కిట్లు ఆ దిక్కునకే ప్రబల వేగముతో పరుగిడు చున్నది ? అవును, కేవలము స్వార్దమున కై సుస్థిరముగ నొక్కచో నుండుటకు దాని కేమి హక్కుగలను? ఆ సర్వనియంత యొక్క శాసనమువల్ల పృధ్వీకర్దమముతో మిళితమై యావద్భూమిని సారవంతముగను, సస్య శాలినిగను ఒనర్చుటకు తన ఔన్నత్యమును పరిత్యజించి నిమ్న గామినియై ప్రవహింప వలసి యున్నది.

ఈ ప్రకారము నేను భావనలో మునిగి యుండగా నఠాత్తుగ నాఅంతర్యామి యొక్క గంభీరా దేశ వాణిని వింటిని " నీవీగర్వభావమును పరిత్యజంచి ఈనదివలెనే నిమ్న గామి కమ్ము ! నీవిక్కడఏ సత్యమును పొందినీవో, ఏనిర్భరమును నిష్టయు నేర్చికొంటివో వాటిని పృధివికి పోయి ప్రచారము చేయుము ! ” నేనులికి పడితిని." అయినచో నేసి పుణ్య భూమిని, ఈ హిమాలయములను వదలిపోవలెనా ఏమి? ఇన్నడును తలంచ లేదే ! ఎంత కఠోరత్వమునో వహించి, సంసారమునుండి ఉపరతుడనైతిని. మరి యొకసారి సంసారమున బుధింపబడి అందరితో. కలియవలయునా? నామనస్సు నిమ్నగతిని పొందెను. సంసారము తలంపునకు వచ్చెను, మరల నింటికి తిరిగివెళ్ల వలెను. సంసార కోలాహలములో నాకర్లములు బదిరములై పోవును కాబోలు : ఈ భావనలతో నాహృదయము శుష్కమై పోయెను. మ్లాన భావముతో నింటికి తిరిగి వచ్చితిని.

రాత్రి నానోటి కేదియు పాట రాకుండెను. వ్యాకుల హృదయముతో శయనించితిని. బాగుగ విద్రపట్ట లేదు. రాత్రి యింకను ఉండగనే లేచితిని. హృదయము కంపించుచుండెను. నాడి దడదడ కొట్టుకొను చుండెను. నాశరీరమునకు మున్నెన్నడును యిటువంటి అవస్థ ఘటిల్లు లేదు. ఏదైన తీవ్రజాడ్యము బయలు దేరు నేమో యని

es