పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/194

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

మహర్షి దేవేంద్రనా ధఠాకూర్ స్వీయచరిత్రము,



మరుచటి పాతః కాలమున దుగ్ధ పానము గావించి పదవ్రజుడ నై బయలు దేరితిని. అనతిదూరముననే యొక నిబిడారణ్యమున ప్రవిష్ణుడ నైతిని. ఏలనన ఆమార్గము అరణ్య మధ్యమునుండి పోవుచుండెను. మధ్య మధ్య ఆవనమును భేదించుకొని రౌద్రకిరణములు చెదరి మార్గ మున పడుచుండెను. అందువల్ల వనము యొక్క శోభ మరింతదీ ప్తి వహించుచుండెను. పోవుచుండగా వనమునం దచ్చటచ్చట కొన్ని మహా పురాతన వృక్షములు సమూలముగ నుత్పాటితము లై భూమిపై పడి యుండుట జూచితిని. అనేక తరుణ వృక్షములు సహితము దావానలము చే దగ్ధములై అకాలమరణమునొంది పడియుంటగూడ జూచితిని. చాలదూరము నడచిన పిమ్మట సవారిలో కూర్చుండి క్రమముగా మరి యొక నిబిడారణ్యము ప్రవేశించితిని, పర్వతారోహణము చేయుచు నాయరణ్యము లోనికి దృష్టి నిగిడ్పగా నందు. కేవలము హరితవర్ణమై, ఘనపల్ల వానృతమై, యొక్క పుష్పము గాని ఫలము గాని లేక యుండిన మహానృక్షముల జూచితిని. ఒక్క " కేలు” అను వృక్షము మీద మాత్రము హరితవర్ణ మగు ఒక విధమైన వికారములగు ఫలములుండెను. వీనిని పక్షులు సహితము భక్షింపవు. కాని పర్వతమున కిరుప్రక్కల మొలచి యుండిన వివిధ తృణలతాదుల శోభమాత్రము అతిచమ త్కారముగ నుండెను. వానినుండి ఎన్ని జాతుల పుష్పములు ప్రస్ఫుటి తములగుచున్నవో గణించుటకు సాధ్యము కాదు. శ్వేత, నీల, కాంచన వర్ణములతో వెలుంగుచు ననేక పుష్పజాతులు ఇటునుండియు అటు నుండియు నయనముల నాకర్షించుచుండెను. ఈ పుష్ప సముదాయము యొక్క సౌందర్యలావణ్యమును వానియొక్క నిష్కళంక పవిత్రతయు జూడగా నాపరమ పవిత్ర పురుషుని హస్తము యొక్క చిహ్నము వానియందు స్పష్టముగా కనబడెను. వీని రూపమునకు పోలిన సౌరభము లేదు; గాని ఇంకొక విధమైన తెల్ల గులాబి గుత్తులు గుత్తులుగా వస