పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/115

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియొకటవ ప్రకరణము.

108




కొని పవితుడనైతిని. ఇంతలో హఠాత్తుగా నలుదిక్కుల ధూళి నెగర గొట్టుచు నాయిసుకలో నుండి యొక సుందరమైన ఫీటన్ బండి వచ్చు చుండెను. ఒంటెలుమాత్రము నడువదగిన ఆమార్గమున బండినడచు టకు వీలగునా ? గుఱ్ఱములు పరుగెత్తుటకు సాధ్యమగునా ? ఇటువంటి

ప్రదేశమునుండి అది యెచ్చటికిపోవునో నాకు తెలియ లేదు. ఇంత

లో నాబండి మాపడవ కెదురుగ నాగెను. బండిలో నుండి యొకడు దిగి నన్ను సందర్శింప నిచ్చగించెను. నేనాతని ఫిలచి, ఏమికావలెనని యడిగితిని. అతడు చేతులు జోడించి, “వర్గమాన్ రాజాధిరాజావారు మిమ్ములను కలసికొనవ లెనని ఎంతయు గోరుచు ఈ బండిని పంపియు న్నారు. తమరు అనుగ్రహించి ఆయన యిచ్ఛ నెర వేర్పుడు” అనెను “ నేను నదీప్రవాహము, వనము, పర్వతములను చూచుటకు మాత్ర మేవచ్చి తిని. 'నేనిక్కడ రాజావారిని చూడజూలను, నేను నదిమీదనే వచ్చి, నదిమీదనే తిరిగిపో దలచితిని. 'నేనింక భూమిమీదికి రాజాల”నని యాతనితో చెప్పితిని. “తమరిని నాతో తీసికొని పోకుండిన యెడల మహా రాజుగారి యెడల నేను మహాపరాధి నగుదును. నాయందనుగ్ర హముంచి యొక్క మారు రాజుగారికి దర్శనమిండు. మీయెడల నా యనకుగల అనురాగము చూచినచో వారవశ్యము పరితృప్తులగుదురు నేను మిమ్ములను కొనిపోకుండ తిరిగి వెళ్ళను” అనెను. ఇట్లు నన్ను చాలవరకు బ్రతిమాలుకొనగా చివరకు నేనాహ్వానమును స్వీకరించితిని. 'నేను భోజనము చేసి మధ్యాహ్నము రెండుజాములు దాటిన పిమ్మట బయలు దేరితిని. బర్ద్వాను చేరు సరికి సాయం కాలమయ్యేను.


సమరోపకరణ సమన్వితమగు నొక వాసస్థానము నా కొరకు నిర్ధావితమై యుండెను. అచ్చట రాజవరేణ్యుని ప్రధానామాత్య వరులు. గోవింద బెనర్జీ, కీర్తిఛటర్జీ మొదలగు వారందరు నాచెంత హాజరై యుండిరి. నేనేమి చేయుచున్నానో, యేమి మాట్లాడుచున్నానో, ప్రతి