పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/107

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము.

95



ధర్మమును మనలను రక్షించునుగాక. దివాలా కోర్టులో నెప్పుడు మనము తల మొగ్గ కుందుము గాక” ఇట్లు సంభాషించుచు నిల్లు చేరితిమి.నేనేమి కోరితినో అదే జరిగినది. మా ఆస్తి అంతయు మాచేతిలో నుండి తప్పిపోయెను. నామనసులో ప్రపంచాభిలాష లేకుండెను. అట్లే ప్రపంచ వస్తువులు నాకిం కేమియు లేకుండెను. రెండింటికిని సరిపోయెను.


“ ఆయభిలాషలో 'మెఱుపు కొరకే కాని వేరేందుకు పార్ధన లేకుండు గాక. అప్పుడు విద్యుత్తు వచ్చి నాధన ధాన్యములను తగల బెట్టినచో ఆశ్చర్య మేమియు లేదు. ”


నేనిట్లు మెఱపు కొరకు పాప్రార్ధించు చుండగా మెఱుపు వచ్చి సర్వమును తగుల బెట్టెను. ఆశ్చర్యమే మున్నది ? నేనన్న దేమనగా, " హే ఈ్వరా! నీవు తప్ప నా కేమియు నక్కర లేదు. ” ఆయన ప్రసన్నుడై నాప్రార్ధన నంగీకరించెను. అంగీకరించి నాకు సాక్షాత్కా రమై నావద్ద మిగిలియున్న వన్నియు పీకి వేసేను. “ గుక్కెడు మంచి నీళ్ళు తాగుటకు, మహేశ్వరా, నావద్ద నొక్క పైస పంచదారయై నను లేదు. " నాప్రార్దన పూర్ణమై ఈ కార్యములో పరిణమించినది.


నాడాస్మశాన వాటిక యందున్న దినమే దినము. మరల ఈ దిన మటువంటిది. నేనింకొక సోపాన మెక్కితిని. నానౌకర్ల దళము తగ్గించితిని, నాగుర్రములను, బండ్లను అన్నిటిని వేలమునకు బంపితిని. నాభోజనము, దుస్తులు తగిన రీతిని తగ్గించితిని. ఇల్లు విడువకుండ సన్యాసినై తిని, మరుసటి దినమేమి భుజింతును, ఏమి ధరింతును అని ఇంక ఆలోచించుట లేదు; రేపు ఇంటి వద్ద నుందునో, ఇల్లు విడుతునో గూడ ఆలోచింపను. ఒక్క సారిగా నిష్కాముడనైతిని. నిష్కామపురుషున కెట్టి సుఖమును, శాంతియు ఉండునో ఉపనిషత్తులలో చదివి