పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/46

ఈ పుట ఆమోదించబడ్డది

[5]

మహర్షి దేవేంద్రనాథటాగూరు

33



బదునెనిమిది మాసములుండి మన వేదాంతశాస్త్రమును జక్కఁగఁ జదివి కాలముఁబుచ్చుచు నెడనెడ మహోన్నతమయిన యా పర్వత రాజముయొక్క గాంభీర్యమునుంజూచి పరమేశ్వరుని మహామహిమను గొనియాడుచు మనశ్శాంతిని బడసెను. అతఁడాకొండలమీఁద నున్న కాలమునఁ గలకత్తానగరమునఁ గేశవచంద్రసేనుఁడను పందొమ్మిది యేండ్ల ప్రాయముగల కుశాగ్రబుద్ధియొకఁడు ప్రమాణపత్రికపై సంతకముఁ జేసి బ్రహ్మసమాజమునఁ జేరును. దేవేంద్రనాథుఁడు మంచుకొండమీదనుండి వచ్చి తనసమాజములోఁ జేరిన యీబాలుని చాక చక్యమునకు బాండిత్యమునకు సద్గుణసంపదకు గడుమెచ్చి వానితోఁ జెలిమిఁజేసి వానితోఁగలిసిమతాభివృద్ధికయి పనిచేయనారంభించెను. చంద్రసేనుఁడు దేవేంద్రనాథునిపైఁ బుత్రప్రేమయు శిష్యవాత్సల్యమును జూపెను. ఈగురుశిష్యు లిద్దఱు బ్రతిదినము గలిసికొని రాత్రులు ప్రొద్దుపోవువఱకు వేదాంతచర్చలు సలుపుచు పరస్పర జ్ఞానాభివృద్ధిఁ జేసికొనుచుండిరి. ఈయిరువురకూడికచే బ్రహ్మసమాజ మతము జనసమ్మతముగాఁ జొచ్చెను. కేశవచంద్రుఁ డింగ్లీషునను దేవేంద్రనాథుఁడు బంగాళీలోను మతోపన్యాసములు చేయ నారంభించిరి. బుద్ధిసంపన్నుఁడగు శిష్యుఁడు క్రొత్తక్రొత్త పద్ధతులనెన్నో యూహించి తెలుప ధనసంపన్నుఁడగు గురువు వానినిఁ గొనసాగఁ జేసెను. 1859 వ సంవత్సరమున దేవేంద్రనాధుఁడు తన కుటుంబముతోఁ బొగయోడ నెక్కి సింహళద్వీపమునకుఁ బయనము చేయదలప బాలుడు కేశవచంద్రుఁడు వారితోఁ బయనమయి పోయెను. ఈ ప్రయాణమున గురుశిష్యుల స్నేహబంధము మునుపటికన్న దృఢ మయ్యెను. సింహళమునుండి వచ్చినపిదప దేవేంద్రనాథుఁడు బ్రహ్మ ధర్మప్రకారముగఁ దనకూఁతునకుఁ బెండ్లి చేసెను.

1861 వ సంవత్సరమున వారిరువురుఁ గలిసి 'యిండియను మిఱ్ఱ' రను నాంగ్లేయపత్రిక నొక దానిని ప్రకటింపసాగిరి. అదియిప్ప