పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/280

ఈ పుట ఆమోదించబడ్డది

నవాబ్ సర్ సలార్ జంగు

231



సౌలభ్యముకొఱకు సంస్థానము నైదుభాగములుగను బదునేడు జిల్లాలుగను విభజించెను. అదివఱకు రయితులు దివాణముపన్ను రొక్కము నీయలేక ధాన్యాది పూర్వకముగ నిచ్చుచుండిరి. అతఁడాపద్ధతి కొట్టివేసెను. భూములు కొలిపించి సరియైన వైశాల్యము దెలిసికొనెను. మఱియు రయితులకు భూములు శాశ్వతముగా నుండునట్లు శిస్థు హెచ్చకుండునట్లు చాల మార్పులంఁ జేసెను. సలారుజంగు సంస్థానమునందుఁ జేసిన యభివృద్ధిని రెసిడెంటుగా నుండిన సాండ్రను దొరగారు వ్రాసిన యీ క్రింది వాక్యమువలన మనము తెలిసికొన వచ్చును. "ఇప్పటి హైదరాబాదు సంస్థానమునకు వెనుక నలువదియేండ్ల క్రిందటనున్న సంస్థానమునకుఁ భేదముచూడ నిప్పటి యింగ్లండునకు రెండువందల యేండ్ల క్రిందటి యింగ్లండునకుగల భేదము కలదు. ఈ యభివృద్ధికంతకు సర్ సలారుజంగు పడినపాటు నా పూర్వపు రెసిడెంట్లు వానికిజేసిన సహాయము ముఖ్య కారణములు. ఖజానాధనముతో నిండియుండును. ప్రతిసంవత్సరము వ్యయముపోగా సంస్థానమున కెనిమిది లక్షలరూపాయల యాదాయమిప్పుడున్నది. శిస్తు వసూలు చేయుటకు మునుపటి యిజారాపద్ధతి నీ దివాను కొట్టివేయుటచే గ్రామములలో నిప్పుడు మునుపటివలె నల్లర్లు లేవు" హైదరాబాదు సంస్థానములోని జనులు నాగరికతలేని మోటవాండ్రగుటచే సలారుజంగు తమకుజేసిన మహోపకారములను గుర్తెఱింగికృతజ్ఞులై యుండ లేకపోయిరి. అందుచేతనతడు క్రమక్రమముగా జనులచేత ద్వేషింపఁ బడెను. వ్యవహారములలోఁ గఠినముగా నున్న వారికందరకు నట్టియవస్థయే ప్రాప్తించునుగదా ! అనేకులకు విరోధియగుటచే నతని ప్రాణము తీయుటకు మఱియొక ప్రయత్నము జరిగెను. 1868 వ సంవత్సరమందు సలారుజం గొకనాఁడు దర్భారునకుబోవుచుండ నొక దురాచారుఁడు వానిమీఁద