పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/227

ఈ పుట ఆమోదించబడ్డది

188

మహాపురుషుల జీవితములు

రూపాయిలును, ఉయ్యలలోఁబెట్టి యూఁచనిచ్చినందునకు నలువది రూపాయిలును, గంథముపూయనిచ్చినందున కఱువదిరూపాయిలును, ఏకశయ్యాగతులు కానిచ్చినందున కేఁబది మొదలుకొని యేనూరు రూపాయిలు వఱకును, కలసి రాసక్రీడ చేయనిచ్చినందునకు నూరు మొదలుకొని యిన్నూరు రూపాయిల వఱకును, ఉమిసిన తాంబూలమును తిననిచ్చినందునకు పదునేడురూపాయిలును, తాము స్నానము చేసినట్టిగాని తాము కట్టుకొన్న బట్ట యుతికినట్టిగాని నీరు త్రాగ నిచ్చినందునకు పందొమ్మిది రూపాయులును, గ్రహింతురఁట. మనుష్యజన్మమెత్తినవా రింతకంటె నెక్కువగాఁ జెప్పుట సాధ్యమగునా?"

నాగరికులయిన జనులు తలంచుకొనుటకైనను హేయములగు నీ దురాచారములను నిర్మూలింపఁదలఁచి కృష్ణదాసుమూల్జీ యీగురు పిశాచములవికృత చేష్టలను తనపత్రికాముఖమున బయలుపుచ్చి యల్లరి చేయసాగెను. తమగుట్టు బయలుపడుటచే గురువులు భయపడి లంచములచేతను బెదిరింపుల చేతను వానిని మిన్నకుండ చేయవలయునని యత్నించిరిగాని కృష్ణదాసు తనసంకల్పమును విడువడయ్యె. కృష్ణదాసు వ్రాయువ్రాతలు గురుమహారాజులకు భరింపశక్యములుగాక యుండుటచే నామహారాజులనేకులుకూడి తమ శిష్యజనులందరిచేత మూల్జీని వెలివేయించి యిబ్బందిపెట్టుటకు ప్రయత్నించి 1859 వ సంవత్సరము జనవరి నెలలో నొక యొడంబడికను వ్రాసికొనిరి. అందున్న ముఖ్య నిబంధనలివ్వి. 1 వల్లభాచార్యమతములోఁ జేరిన వైష్ణవుఁడెవఁడును గురుమహారాజులను న్యాయస్థానమునకు రప్పించుటకు సమనులు చేయించగూడదు. అట్టి సమనులు తీసుకురాకూడదు. 2. గురుమహారాజుల నేకోర్టులకు సమను చేసి పిలుపింపగూడదని దొరతనమువారిచేత నొకచట్టము నిర్మింపఁజేయుటకు వలసినంతసొమ్ము పోగుచేయ