పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/74

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆల్సిబియాడీసు

55


నకు వెళ్లెను. అక్కడ వా రతనిని మర్యాదగఁ జూచిరి. స్పార్టనుల వేషభాషలను వారి యాచారములను నతఁ డవలంబించి వారికి స్నేహపాత్రుఁ డయ్యెను. వర్తమానములచేత నతఁడు మహాకులీనుఁ డని వా రంతకు పూర్వము వినినందున నతనిని వారు మన్నించిరి. ఆ దేశపు రా జతనినిఁ జూచి మత్సరముచేత జంపుటకుఁ బ్రయత్నించెను. ఆ సంగతి తెలిసికొని యతఁడక్కడనుండి పరారియయ్యెను. పారసీకదేశపు ధనికుఁ డొకఁడు దైవికముగ వచ్చినందున మైత్రికలిపికొని యతనితో కలిసి లేచిపోయెను. అథీనియనులు స్పార్టనులు పోరాడుచున్న సమయమున నీ పారసీకదేశస్థుఁడు స్పార్టనులకు సహాయము చేయుటకు వచ్చెను. స్పార్టనులు మంచివారు కారని యతనితో చెప్పి వారికి విశేషముగ సహాయము చేయఁగూడదని యాతనితో 'ఆల్సిబియాడీసు' పలికెను. అథీనియనులు యుద్ధ సమయమున శూరుఁడైన 'ఆల్సిబియాడీసు' లేఁడని విచారించిరి. ఆ సంగతి నతఁడు విని మంత్రతంత్రములుచేసి పారసీక దేశస్థుని యథీనియనులపక్షము నవలంబించునట్లు చేసెను. వారిలో ద్రోహుల గొందఱనుపట్టి స్వదేశీయుల కతఁ డప్పగించెను. ఈ యుద్ధములో నథీనియనులు గెలిచిరి.

ఇంత కాలమునకు స్వదేశమునకుఁ బోవలెనని యతఁడు యత్నించెను. మహా వైభవముతో నతఁడు స్వగ్రామమునుచేర నతనిని దర్శించుటకుఁ బ్రజలు గుమిగూడిరి,