పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/71

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


మును చేరెను. నాఁడు మొదలు దంపతు లిరువురు సఖ్యతగ నుండిరి. కొంతకాలమున కామె మరణమునొందెను.

అతనివద్ద మంచి కుక్కయొకటి యుండెను. సొగసైన దాని పుచ్ఛము నతఁడు కోసివేసెను. ఈ సంగతి గ్రామస్థులు విని నవ్విరి. 'ఎందు కట్లు జేసితి'వని కొంద ఱడుగ 'మీరు పరిహసింపవలసిన దని చేసితిని. ఇంతకంటె హెచ్చు దుర్మార్గము చేసితి నని మీ రభిప్రాయపడఁగూడ'దని యతఁడు సమా ధానము చెప్పెను.

అతనివద్ద మంచి గుఱ్ఱములును రథములును ఉండెను. 'ఒలింపికు' క్రీడలలో నవి మూఁడు నాలుగు పందెములను గెలిచెను. దేశములో వీనిని విశేషముగఁ గలవాఁ డతఁడేగాని పరులు లేరు. క్రీడలకు వాని నధికముగఁ బంపువాఁ డతఁడే.

దాత్రుత్వమునం దతనికి సమానులు లేరు. బీదలకును సాధువులకును రెండు చేతుల నతఁ డిచ్చుచుండెను. ఇచ్చిన సొమ్ముకు లెక్క లేదు. పుచ్చుకొనినవారికి పరిమితి లేదు. ఏ విధానమునులేక నిధానముగ దానములను వితానముగఁ జేయుచు ఘనులను మించెను,

కులశీలములు కలిగి ప్రజ్ఞావంతుఁడై బంధుమిత్రవర్గంబుల సంసర్గీయంబుతో నతఁడు ప్రకాశించుచుండెను. రాజకీయన్యవహారములలో నతఁడు ప్రవేశించుటకు మార్గములు నిష్కంటకముగ నుండెను. త్రిశక్తులు గలిగి దురవగాహమైన