పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/70

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆల్సిబియాడీసు

51


డా గ్రంథమును సవరణఁజేసి యుంచితి నని చెప్ప' 'ఓహో' మీరు బాలురకుఁ జదువు చెప్పెదరా? హోమరును సవరణఁ జేయు శక్తిఁగల తమరే బాలురకు విద్యాభ్యాసము చేయఁ దగినవా”రని ఆల్సిబియాడీసు పలికి యతనికి వందనము చేసెను.

ఒక పర్యాయము గురుశిష్యులు కలిసి యుద్ధమునకు వెళ్లిరి. అందులో శిష్యుఁడు గాయము తగిలి పడిపోయినందున గురు వతనిని రక్షించి శత్రువును శిక్షించెను. యుద్ధము ముగిసినపిదప 'సోక్రెటీసు'న కీయుటకు బదులుగ నతని ప్రేరణమున వీరకిరీటమును ప్రజలు శిష్యున కిచ్చిరి.

ఒక సమయమున బాలురతోఁ గలిసిపోవుచు వారి ప్రోత్సాహమున నిష్కారణముగ నతఁ డొకనికొక లెంపకాయ వేసెను. . అందుకు వాఁడు గినిసి యీ దౌర్జన్యమును గ్రామమంతట సాటెను. మఱునాఁ డుదయమున నతఁడు వానియొద్దకుఁ బోయి తనను శిక్షించవలసినదని దుస్తులుతీసి నానియెదుట , నిలువఁబడెను. వాఁ డందుకు సంతసించి యతనిని క్షమించెను.

అతఁడు భార్యతో పొత్తులేక పరస్త్రీలతో సంచరింప నామె స్వపితృగృహమునకుఁ బోయి విడియాకులీయఁదలఁచి గ్రామపురోహితుని సమీపించెను. అప్పు డతఁ డా సంగతిని విని, పరుగిడి యామె నెత్తుకొని రాజమార్గమున వచ్చి స్వగృహ