పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/58

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జూలియసు సీౙరు

సీజేరు సామంతుల కుటుంబములో క్రీ. పూ. 102 సంవత్సరమునఁ బుట్టెను. ఇతఁడు 'పాంపేయి' 'శిశిరోల' కంటె నాలుగు సంవత్సరములు చిన్నవాఁడు. 'కాన్సల్ ' అను పేరుగల యక్షదర్శకుని యుద్యోగముఁ దన తండ్రి చేయకయే మృతినొందెను. క్రీ. పూ. 90 సం॥ రములో నితని పినతండ్రి యా యుద్యోగమును చేసెను. ఇతని పితృష్వసయైన 'జూలియా'ను 'మేరియసు' వివాహమాడెను. సీజేరు మొదటినుండియుఁ బ్రజలపక్షమున మాటలాడుచుండెను. అందుచేత నతఁడు శత్రువుల బారినుండి తప్పించుకొని దేశాంతరగతుఁడయ్యెను. సాహసిక నావికులు కొంద ఱతనిని చెఱపట్టి విడుదల సొమ్ము పుచ్చుకొని యతనిని విడచిరి. పిదప సీజేరు కొన్ని యుద్ధనావలను జతపఱచి యా సాహసిక నావికుల నోడించి, వారి నావలను, నియామకునిఁ బట్టుకొని వారికి మరణదండన వేయించెను.

ఈలోపున నతని శత్రువు లుచ్చపదచ్యుతులైరి. అతఁడు రోముపట్టణమును జేరెను. అతని మిత్రుల కమందానందము కలిగెను. క్రీ. పూ. 68 సం||రమున నతఁడు 'స్పాని

39