పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


భర్త్సనవాక్యములలోకూడ నటులనె యున్నది. 'మిడియా'సను వానికి ప్రతికూలముగ నితఁ డిరువదిమూఁడు సంవత్సరముల ప్రాయమున ప్రవచనములను వ్రాసెను. అప్పటికింకను కీర్తి ప్రతిష్ఠల నతఁడు పొందలేదు.

పరిగృహ్యమానవైరుండును, వైరానుబంధజాజ్వల్య మానరోషానలుండునునై యతఁ డొప్పుచుండెను.. ధనము కలిగి స్నేహితుల ప్రాపకముమీఁద నిలువఁబడియున్న ‘మిడియాసు'ను పనిలోనుండి తొలఁగించుట కతనికి సమర్థత లేకపో యెను. అందునలన నతనికిఁ బ్రయోజనముఁగూడ లేదు. కాఁబట్టి వానిపక్షము నవలంబించుట కతఁ డద్యుక్తుఁ డయ్యెను. గ్రీసు దేశమును 'ఫిలిప్పు' అనువాని దాడినుండి రక్షించనలసి వచ్చినప్పుడు రాజకార్యములయం దతనికిఁ గల యాకాంక్ష సిద్దించుట కవకాశము కలిగెను. పూనినకార్యమును మహాయోధునివలె నిర్వహించుటకు, వక్తృత్వమునకె కాక పలికిన సత్యవాక్యముల కాతఁడు ప్రఖ్యాతినొందెను. గ్రీసు దేశపు ప్రజ లతని నభినుతించుటయే కాక, పారసీకదేశపు రాజాను గ్రహమున కతఁడు పాత్రుఁడయ్యెను. మండలాధీశ్వరుఁడైన ‘ఫిలిప్పు' సహిత మందఱి వక్తలకంటె నితని నెక్కుడుగ నభినందించెను. శత్రువులుకూడ వాగ్వాదములలో నతనిని శ్రేష్ఠునిగ బహూకరించిరి.

మనుజులతోఁగాని వస్తువులతోఁగాని తుడముట్ట పొత్తు