పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

ప్లూటార్కు వర్ణితచరిత్రలు

ప్లూటార్కు

అన్నినాఁడులలోఁ జిన్ననాఁడు మంచి దని యొక మహాపురుషుఁడు చెప్పెను. మాయమర్మములు తెలియక నిర్గుణుల మై యెల్లప్పుడు నానందించుచు మనము చిన్నతనమును గడుపుదుము. వయస్సు ముదిరినకొలఁది లోకవ్యాపారములలోఁ దిగి విషయాసక్తులమై మనమ తరంగములలోఁ గొట్టుకొను చుందుము. అటుల ఏకాంతస్థలమున చిదానందమును బొందుచుఁ గాలము గడపిన తత్వజ్ఞానియైన 'ప్లూటార్కు'యొక్క జీవిత చరిత్రమును ముందుగఁ జదివి హర్షించి, తదనంతర మతనిచే వ్రాయఁబడిన లౌకికతరంగములలోఁ గొట్టుకొనుచున్న మహాపురుషుల జీవిత చరితములఁ బఠింపవచ్చును..

ప్రాజ్ఞుని యనుభవములను మనమెట్లు స్వీకరించునట్లే లోకమునుగూర్చిన యతని యాలోచనలను సహితము మనము తెలిసికొనవలెను. ప్రపంచ ధర్మములు ద్వంద్వములు. ఇవి యుద్రేకించి రాష్ట్రవినాశమును దెచ్చును. దేశకాల గృహ