పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/169

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


సుకూర, మఱియొకరికి ఇగురుకూర, యిష్టము”. వచ్చిన ప్రతివానికి సమాధానము చెప్పుట కష్టమని తోఁచి, పది సంవత్సరములవఱకు దేశమును విడుచుటకు వారివద్ద సెలవు పుచ్చుకొని, వర్తకమునిమిత్త మని చెప్పి, యతఁడు పై దేశములకు లేచి పోయెను.

ఈజిప్టు మొదలగు దేశములను జూచుచు " క్రీససు” యను నొక రా జతనిని నాహూయము చేయుటచేత, నితనిని దర్శించుటకు సోలను పోయెను. ఈ రాజు గొప్ప ధనవంతుఁడు; కుబేరుఁ డని చెప్పవచ్చును. కుగ్రామమునుండి వచ్చినవానికిఁ బట్టణములో నివి యన్నియు విచిత్రముగ నగుపడునటుల, రాజధానిలోఁ బ్రతివస్తువు నతనికి గన్నులపండువుగ నుండెను. అలంకరించుకొని మహావైభవముతో రాజు సముఖమునకుఁ బోవుచున్న ప్రతి సామంతప్రభువు నతఁడు రాజని భావించెను: తుద కతనికి రాజదర్శనమయ్యెను. నగరులోఁ జూచినవన్నియు బంగారువస్తువులే; అంతట నవరత్నములే; చీనిచీనాంబరములు తండోపతండములు. వీనిని జూచి, యతఁడు సంతసించ లేదు; అతని మనస్సు చలించలేదు. వీనిని జూచి యతఁ డాశ్చర్యము బొందనందుకు, రా జాశ్చర్యపడి, ఖజానాకొట్ల నతనికిఁ జూపించవలసిన దని, సేవకుల కాజ్ఞ జేసెను. బొక్కసములో నున్న ధనమునకు లెక్క లేదు; ధనరాసులు మూలుగుచుండెను. వీనిని గన్నులారఁ జూచి, యతఁడు రాజువద్దకు వచ్చెను. “నా