పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/163

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


సోలను మంచిభోగి, దేశాటనము జేసి కష్టపడినందున , నతఁడు మహావైభవముతో సుఖముల ననుభవించెను. అనేక దేశములు చూచినందున, భోగమునకు గావలసిన వస్తువుల నా యా దేశములనుండి యతఁడు దెప్పించుచుండెను. అతఁడు కొంచెము కవిత్వము చెప్పగలఁడు. విరమించుకాలములో నతఁడు సరసముగ నీతిబోధకములైన చరణముల - నల్లుచుండెను; వానిలో రాజనీతులను బొందుపఱుచుచుండెను.

అతఁడు 'అథీనియనుఁడు'. 'ఆథెన్సు' పట్టణములో 'ఆర్కను' యను పెద్దయుద్యోగముఁ జేసెను. అక్కడి ప్రజల క్షేమమున కనేక శాసనములను నియమించినందున, నతఁడు ధర్మశాస్త్రవేత్తయనేగాక, ధర్మశాసనుఁడనికూడఁ బేరొందెను. "ఈ నా శాసనములప్రకార మథీనియనులు నడచుకొనిన వారికి శ్రేయస్సు గలుగు"నని యతఁడు హితోపదేశముఁ జేసెను.

ఒకనాఁడతఁడు స్నేహితుఁడైన 'థాలీసు'తోఁ గలిసి భోజనము జేయుచుండెను. అప్పుడు స్నేహితునిజూచి "నీ వెందుచేత వివాహము చేసికొన లే"దని యతఁ డడిగెను. అందుకు స్నేహితుఁడు జవాబు చెప్పక యూరకుండెను. తరువాత నొక పరిచారకునికి కొన్ని సంగతులు బోధించి, 'థాలీసు' వానిని సోలనువద్దకుఁ బంపెను, స్నేహితు లిరువురు కలిసి సంభాషించుచుండ, బరిచారకుఁడు వచ్చి “నేను ఆథెన్సుపట్టణమునుండి