పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/118

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాంపేయుఁడు

99

అతఁ డనంతరము రాజధానికి వచ్చినపైని 'వీరజయోత్సవమును' ప్రజలు చేసిరి. ఇది రెండవ యుత్సవము. తదుపరి పాంపేయుఁడు క్రాసస్సుతోఁగూడ 'అక్షదర్శకుని' యుద్యోగమును నిర్వహించెను. వారిరువురు గొంతకాల మేకీభవించి పని పాటులను జక్క పెట్టిరి గాని తుదకు కలహించి వ్యవహారమును మానిరి.

అటుపైని పాంపేయుఁడు సభలో న్యాయవాదిగ నుండలేదు. కొన్ని సమయములలోమాత్ర మతఁడు బయటికి వచ్చు చుండెను. బయలుదేరినపుడు బంధుమిత్ర పరివారములతోడఁ గూడి యతఁడు వాహ్యాళి సలుపుచుండెను. అనేకులు పనివార జనులకు వేతనము లిచ్చి పోషించుచు మహావైభవముతో నతఁడు జీవించెను. అతి పరిచయము మర్యాదకు లోకువయని యెంచి పరుల కతఁడు చర్శనమిచ్చుటలేదు. మొదటినుండి, ప్రజారాజ్యములో జీవించుచు ప్రజలను బొడగన్న భృత్యుని కైవడి వారియెడల సంచరించి కాలపరిపక్వమున రణశూరుఁడని పేరుఁబొందినందు కతనికి గర్వము బలిసెను.

ఇంతలో మధ్యధరాసముద్రముమీఁద నోడదొంగలు విస్తరించి నావికాయాత్ర జేయువారిని వధించుచుండిరి. నావికాయాత్రఁ జేయుట కష్టమయ్యెను, వర్తకవ్యాపారములు నిలిచిపోయెను. రోమను లందుకు కోపించి వారిని దండించుటకు 500 యుద్ధనావలను సమకూర్చి పాంపేయుని